ePaper
Friday, August 14, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపెద్దమందడిలో బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ

పెద్దమందడిలో బీజేపీ హర్ ఘర్ తిరంగా ర్యాలీ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు ముప్పురి చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ పెద్దమందడి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ముప్పురి చెన్నయ్య మాట్లాడుతూ దేశ సమైక్యత, సార్వభౌమత్వం, జాతీయ భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో భాగస్వాములై జాతీయ జెండాకు గౌరవం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ముప్పూరి చెన్నయ్య, మాజీ అధ్యక్షుడు తిరుపతయ్య, విట్టల్ రెడ్డి, రాము, నాయకులు, కార్యకర్తలు, పాఠశాల, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!