సొంతింటి కలను సాకారం చేసుకున్న రోజే అసలైన ఆనందం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 13 2026: పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ రమేష్ గౌడ్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన గృహంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని, స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అభినందించి, నూతన గృహంలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రతి మనిషి జీవితంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక ఉంటుందని, ఆ కలను సాకారం చేసుకున్న రోజే అసలైన సంతోషం కలుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో సొంతింటి కలను కనడమే కాకుండా, దానిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన గృహప్రవేశం సందర్భంగా రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహం ఎల్లప్పుడూ ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రమేష్ గౌడ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

