ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

ఘనంగా లయన్ ఇందూర్ చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు…

📰 Generate e-Paper Clip

 


* లయన్స్ ఆసుపత్రిలో అన్నప్రసాద వితరణ

 

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 అక్టోబర్ 2026.

 

 

రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్, బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ వ్యవస్థాపక సభ్యులు లయన్ ఇందూర్ చంద్రశేఖర్ పుట్టినరోజును పురస్కరించుకొని బోధన్‌లోని లయన్స్ కంటి ఆసుపత్రిలో సేవా కార్యక్రమం నిర్వహించారు.

 

ఆసుపత్రిలో కంటి ఆపరేషన్ చేయించుకున్న రోగులకు, వారి సహాయకులకు మరియు రోజువారీ ఓపీకి వచ్చిన రోగులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ గుండూరు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. పుట్టినరోజు జరుపుకుంటున్న లయన్ ఇందూర్ చంద్రశేఖర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు.

 

పుట్టినరోజు సందర్భంగా పేద రోగులకు కడుపు నింపే ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో విలువైనదని, సంతోషకరమైన విషయమని ఆయన అన్నారు.

 

ఈ కార్యక్రమంలో జి.ఎస్.టి కోఆర్డినేటర్ లయన్ శ్యాంసుందర్ పహాడే, జిల్లా చైర్మన్ లయన్ కె.వి. మోహన్, క్లబ్ కోశాధికారి లయన్ పార్వతి ప్రశాంత్, డైరెక్టర్ లయన్ పుట్టి సాగర్, దుర్గాదేవి కమిటీ అధ్యక్షులు ఇందూర్ కార్తీక్, రుద్రూర్ గ్రామ వార్డు సభ్యులు ఆమంద్ వెంకటేశ్వర్, పాత్రికేయులు బాబు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర...

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ ఊరటి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

మౌలాలిలో ఘనంగా పోతుల వినోద్ యాదవ్‌కు సన్మానం! కుషాయిగూడ ఆర్టీసీ బస్ డిపో గౌరవ అధ్యక్షుడిగా నియామకం పట్ల యాదవ సంఘం హర్షం

 హైదరాబాద్ (పొలిటికల్ పవర్ - తెలంగాణ స్టేట్ క్రైమ్ బ్యూరో):సమాజ సేవలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ముందుండే నాయకత్వానికి తగిన గుర్తింపు లభిస్తే ఆ ప్రాంత ప్రజల్లో ఆనందం రెట్టింపు అవుతుంది....
error: Content is protected !!