పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ఆ గస్టు 13,2026: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికు ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు లేఖ రాశారు. చంచల్‌గూడ నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జికి స్వాతంత్ర్య సమరయోధురాలు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని ఆయన లేఖలో కోరారు. తెలంగాణలో స్వాతంత్ర్యోద్యమం, ప్రజా ఉద్యమాల్లో సంగం లక్ష్మీబాయి చేసిన సేవలను గుర్తించి, ఆమెకు గౌరవంగా ఈ వంతెనకు పేరు పెట్టాలని వి. హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
