పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ బి. చంద్రశేఖర్ హైదరాబాద్,15: దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా సెంటెన్స్ హైస్కూల్‌లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోతీ శ్రీలత శోభన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన మార్చ్‌పాస్ట్‌ను వీక్షించి, విద్యార్థులతో కలిసి వివిధ సాంస్కృతిక, దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, ప్రతిభను అభినందిస్తూ వారిని ప్రోత్సహించారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, జాతీయ సమైక్యత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని మోతె శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. విద్యతో పాటు సేవాభావం, నైతిక విలువలు, దేశం పట్ల బాధ్యత కలిగి ఉండటం ప్రతి విద్యార్థి కర్తవ్యమని పేర్కొన్నారు. విద్యార్థుల మార్చ్‌పాస్ట్, దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ కళా కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
