ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
Homeతెలంగాణచరఖా సత్యాగ్రహంలో పాల్గొన్న ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి

చరఖా సత్యాగ్రహంలో పాల్గొన్న ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జూన్ 18, 2026: దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం, ఓట్ల దొంగతనం, సీట్ల కేటాయింపులో అవకతవకలు మరియు ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యలకు నిరసనగా నిర్వహించిన “చరఖా సత్యాగ్రహం” కార్యక్రమంలో ఏఐపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురువారం (జూన్ 18, 2026) ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్ ప్రాంగణంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిర్వహించబడింది. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా. జిల్లెల ఆదిత్య రెడ్డి మాట్లాడుతూ… ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు శాంతియుత మార్గాల్లో పోరాటాలు కొనసాగించాలని, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల వ్యవస్థ పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!