పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 13 2026: ఆషాఢ మాసం అంత్యంత పవిత్రమైన ‘ముహూర్త శైవయోగం’ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సోమవారం రోజు వనపర్తి పట్టణంలోని చింతల హనుమాన్ ఆలయంలో ఉన్న పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూలై 13న ఏర్పడిన ఈ పవిత్ర శైవయోగం అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారని, ఈ రోజున పరమశివునికి అభిషేకం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల సకల పాపాలు తొలగి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ పరమశివుడి కృపాకటాక్షాల వలన ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
