ePaper
Saturday, September 5, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిచీకరుచెట్టు తండాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

చీకరుచెట్టు తండాలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 05 2026: పెద్దమందడి మండల పరిధిలోని చీకరుచెట్టు తండాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ అంగోత్ లలిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తండా ప్రజలు, బంజారా సేవా సంఘం నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణుడిని కొలిచారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి జన్మాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, మహిళలు, యువత ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. తండాలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూడవత్ కిషన్ నాయక్, రాజు నాయక్, గోపాల్ నాయక్, పండు నాయక్, మన్య నాయక్, కిషన్, మున్యా నాయక్, ఫుల్యా నాయక్, ప్రేమ్ నాయక్, అనిల్ నాయక్, అక్షయ్ సాగర్ నాయక్, భాస్కర్ నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ బంజారా సమాజంలో ఐక్యత, ఆధ్యాత్మికత, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తండాలో పండుగ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకృష్ణుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!