మంత్రి సత్యకుమార్ కు డివైఎఫ్ఐ వినతి.
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ జిల్లా లోని ప్రైవేటు ఆసుపత్రుల పై,ఆర్ఎంపీ ల పై,నిబంధనలు పాటించని డయాగ్నొస్టిక్ సెంటర్ల పై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్న డిఎంహెచ్ఓ నాగరాజు పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల.శివకుమార్ లు తెలిపారు.శనివారం జిల్లా పర్యటనలో భాగంగా కడప కు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జిల్లా లో నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై ఆర్ఎంపి క్లినిక్లపై డయాగ్నొస్టిక్ సెంటర్ లపై అనేక మార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన ఇటువంటి చర్యలు చేపట్టలేదని పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరుగుతుందని అన్నారు.జిల్లా లో ప్రైవేటు ఆసుపత్రులు సామాన్య పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్న పట్టించుకున్న పాపానపోలేదు అన్నారు.కేవలం ఒక్క ఓపీ 300 నుండి 500 వరకు వసూలు చేస్తున్నారని అన్నారు.కొన్ని ఆసుపత్రులు కంప్యూటర్ బిల్లులు ఇవ్వడం లేదని బి ఫార్మసీ ఎం ఫార్మసీ చదివినటువంటి ఫార్మసిస్టు లేకుండా హాస్పిటల్లో ఉన్నటువంటి మందుల షాపులలో అనుభవం లేని వారితో మందులు ఇస్తున్నారు అన్నారు. ఎమ్మెల్సీ డి ఎం ఎల్ టి నర్సింగ్ వన్డే చదివినటువంటి క్వాలిఫైడ్ వారిని ఆసుపత్రిలో నియమించుకోకుండా తక్కువ జీతంతో ఎవరినో ఒకరిని నియమించుకుంటూ వస్తున్నారన్నారు. అలాగే ఇచ్చిన విడిగా పుట్టగొడుగుల్లాగా జిల్లాలో నిబంధనలు పాటించకుండా ఆర్.ఎం.పి వైద్యులు ఎంబిబిఎస్ డాక్టర్ల మాదిరిగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు అన్నారు.డిప్యూటీ డిఎంహెచ్వోలు తూ తూ మంత్రంగా తనిఖీ నిర్వహిస్తూ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వెనకడుగులు వేస్తున్నారన్నారు. ఆర్ఎంపి వైద్యులు ఇంజక్షన్లు వేయకూడదు సెలైన్ బాటిల్ నిర్వహించకూడదు ప్రిస్క్రిప్షన్ రాసి మందులు ఇవ్వకూడదని నిబంధన ఉన్న ఎక్కడ ఈ నిబంధన పాటించలేదని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు ఇవన్నీ తెలిసిన కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళలాగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరిస్తున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లలో కూడా ఇదే పరిస్థితిని రక్త పరీక్షలకు స్కానింగ్ సెంటర్ లకు వస్తే వేల రూపాయలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు ధరల పట్టిక నిర్వహించడం కానీ కనీసం చేసినటువంటి స్కానింగ్ రక్త పరీక్షలకు బిల్లులకు ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్కానింగ్ నిర్వహిస్తున్నారని అన్నారు. వీటి అన్నింటి పైన చర్యలు తీసుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు పూర్తి నిర్లక్ష్యం వివరించడం జరుగుతుందని విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి డిఎం హెచ్ ఓ పై చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
