– తెలంగాణలో కళాకారులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబాలకు హైదరాబాద్ లోని ఉప్పల్ బగాయత్ లో 250 చదరపు గజాల స్థలాన్ని తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలి,
– టిఆర్ఎస్ దేవరకద్ర నియోజక వర్గం ఇంచార్జీ దామోదర్ గౌడ్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 23. 2026.
తెలంగాణలో దగాపడ్డ కళాకారులకు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన జర్నలిస్టు లకు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి హైదరాబాద్ నడి బొడ్డున ఉప్పల్ బగాయత్ లో 250 చదరపు గజాల స్థలాన్ని తక్షణమే ఇవ్వాలని టిఆర్ఎస్ దేవరకద్ర నియోజక వర్గం ఇంచార్జీ దామోదర్ గౌడ్ అన్నారు.మంగళవారం వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గం లోని కొత్తకోటమున్సిపాలిటీ కేంద్రంలో దాబా శ్రీనివాస్ రెడ్డి లాడ్జిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జులై 2న హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ఉప్పల్ బగాయత్ లో జరిగే భూపోరాటనికి తెలంగాణ ఉద్యమ కారులు, తరలి రావాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన పేరుతో ఒక కమిటీ వేసి నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని కేశవరావును ఆ కమిటీలో పెట్టడం సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ మేని పేస్ట్ లోపెట్టిన విధంగా ప్రభుత్వం అమలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భూ పోరాట ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్,జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం ,తెలంగాణ రక్షణ సేన జిల్లా సీనియర్ నాయకులు దాసరి విజయ్ ముదిరాజ్, వరలక్ష్మి, శోభ, శ్యామ్ ప్రసాద్,ఎం కె.
నిజాం, కరాటే శ్రీను,మోహన్, తెలంగాణ ఉద్యమ కారులు, తదితరరులు పాల్గొన్నరు.



