ePaper
Monday, September 21, 2026
📄 ePaper

డ్రగ్స్ పై యువతకు అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

మదనపురం మండలంలో కేంద్రంలో పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచాలి

బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి మహేందర్ నాయుడుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: దనాపూర్ పోలీస్ శాఖ పనితీరు మెరుగుపరచడం, గ్రామాల్లో నిఘా పెంచడం మరియు యువత డ్రగ్స్ కు బానిస కాకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలని బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో మదనాపూర్ ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మహేందర్ నాయుడు మాట్లాడుతూ గ్రామాలకు కేటాయించిన పోలీస్ సిబ్బంది రోజూ గ్రామాల్లో తిరిగే విధంగా చూడాలని, గ్రామంలో ఏ సమస్య ఉంది, ఏం జరుగుతుంది అనే సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చాలని ప్రతిష్టాత్మక కార్యక్రమం తీసుకున్నారని, కానీ మదనాపురం మండలంలో అమలు కావడం లేదన్నారు. డ్రగ్స్ కు బానిసలైన యువత… మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ ను అరికడితేనే నేరాలు తగ్గుతాయన్నారు. ఇటీవల కాలంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో యువత గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమని, దీనిని అరికట్టడానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాని కోరారు. గ్రామాల్లో బీట్ కానిస్టేబుల్ వ్యవస్థను బలోపేతం చేసి, ఉదయం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహించి, గ్రామ పెద్దలు, యువజన సంఘాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.

Latest Articles

ప్రజల గొంతుక డా. సతీష్‌ యాదవ్‌కు ఘన సన్మానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్...

జూరాల వద్దకు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులకు మద్దతుగా వెళ్లే ప్రయత్నంపొలిటికల్...

సీజనల్ వ్యాధులతో జాగ్రత్త13వ వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణసెప్టెంబర్ 21:   పొలిటికల్...

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో అరుదైన ఘనతసాధారణ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

జూరాల వద్దకు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులకు మద్దతుగా వెళ్లే ప్రయత్నంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21...

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో సెప్టెంబర్ 21 2026: సికింద్రాబాద్ లాలాపేట్: శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు...
error: Content is protected !!