ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

డ్రైనేజీ బీభత్సం: మురుగుకూపంలో ‘కాకతీయ నగర్’!  * వారం రోజులుగా రోడ్లపై పారుతున్న మురుగునీరు!  * శోభా డైరీ ఫామ్ పశువుల పేడ కలవడంతో మరింత దుర్గంధం!  * అధికారుల బాధ్యతారాహిత్యంపై కాలనీవాసుల కడగండ్ల నిరసన!

📰 Generate e-Paper Clip

మేడిపల్లి (పొలిటికల్ పవర్ న్యూస్ – ఉపేందర్ కూరెళ్ళ):

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్, మేడిపల్లి 9వ డివిజన్ ‘కాకతీయ నగర్’ కాలనీవాసుల పరిస్థితి తీవ్ర వర్ణనాతీతంగా మారింది. గత వారం రోజులుగా కాలనీలోని రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ, ప్రాంతాన్ని మురుగుకూపంగా మార్చినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

శోభా డైరీ ఫామ్ పేడే మూలకారణం!

స్థానికంగా ఉన్న ‘శోభా డైరీ ఫామ్’ నుంచి పశువుల పేడను నేరుగా డ్రైనేజీ లైన్లలోకి వదలడమే ఈ ఘోర పరిస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పేడ చేరుకోవడంతో డ్రైనేజీ పైపులు పూర్తిగా పూడిపోయి, రోడ్లపైకి మురుగు ఉప్పొంగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నడుమ నలిగిపోతున్న ప్రజలు!

సమస్యపై కాలనీవాసులు మున్సిపల్ అధికారులను ఆశ్రయించగా, “వస్తున్నాం.. చూస్తున్నాం” అంటూ కాలయాపన చేశారు. తీరా వచ్చి చూసిన సిబ్బంది—”ఈ పనులు మా పరిధిలోకి రావు, వాటర్ బోర్డు అధికారులు డ్రైనేజీ పైపులు వేయాలి” అని చేతులెత్తేసి వెళ్లిపోయారు.

గత 3 నెలల క్రితం ఇదే డ్రైనేజీ నీరు తాగునీటి మెయిన్ పైప్‌లైన్‌లో కలవడంతో వాటర్ బోర్డు అధికారులు వచ్చి లీకేజీని తాత్కాలికంగా అరికట్టారు. కొత్త డ్రైనేజీ పైపులు వేస్తామని నాడు హామీ ఇచ్చి 3 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయి, రోడ్లపై భయంకరమైన దుర్గంధం వ్యాపిస్తోంది.

> ఎన్నికలప్పుడే వస్తారు.. సమస్యలొస్తే పట్టించుకోరా?

> “వందల సార్లు అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదు. దుర్గంధం భరించలేక చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు, ఇప్పుడు ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం దారుణం.”

> — భాగ్యలక్ష్మి శంకర్ రెడ్డి, కాకతీయ నగర్ కాలనీ అధ్యక్షురాలు

‘పొలిటికల్ పవర్’ డిమాండ్:

ప్రజా ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మున్సిపల్, వాటర్ బోర్డు అధికారులు ఇప్పటికైనా బద్ధకం వీడి, శోభా డైరీ ఫామ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. తక్షణమే నూతన డ్రైనేజీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి కాకతీయ నగర్ వాసులకు ఈ మురుగు నరకం నుండి విముక్తి కల్పించాలని ‘పొలిటికల్ పవర్’ డిమాండ్ చేస్తోంది!

 

Latest Articles

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి – ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

కాబోయే టీచర్లకు కొత్త బాధ్యతలు!. డిగ్రీ రావాలంటే కొందరికి అక్షరజ్ఞానం నేర్పాల్సిందే. రెండేళ్ల కోర్సులో వారు ఐదుగురిని తీర్చిదిద్దాలి.* *సామాజిక బాధ్యతగా టీచింగ్ వృత్తి.* తాజా మార్గదర్శకాలను సిద్ధం చేసిన...

ఉపాధ్యాయ విద్యలో చేరినవారికి కేంద్ర విద్యా శాఖ కొత్త బాధ్యతలు అప్పగించింది. ఉపాధ్యాయ విద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసుకుని పట్టా చేత పట్టుకుని వెళ్లాలంటే కొన్ని బాధ్యతలు...

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకతో దద్దరిల్లిన భాగ్యనగరం – రెప రెప్పలాడిన కాషాయ జెండాలు. నరేంద్ర మోదీ పాలనకే పట్టం కడుతున్న దేశ ప్రజలు. జనసంద్రంగా బీజేపీ...

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.హైదరాబాద్ : ఎటు చూసిన కాషాయం అయినభాగ్యనగరం...

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి – ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.ఘటకేశ్వర్ : అమిత్ షా మహా పాదయాత్రలో...
error: Content is protected !!