ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper

కాబోయే టీచర్లకు కొత్త బాధ్యతలు!. డిగ్రీ రావాలంటే కొందరికి అక్షరజ్ఞానం నేర్పాల్సిందే. రెండేళ్ల కోర్సులో వారు ఐదుగురిని తీర్చిదిద్దాలి.* *సామాజిక బాధ్యతగా టీచింగ్ వృత్తి.* తాజా మార్గదర్శకాలను సిద్ధం చేసిన ఎన్సీటీఈ.

📰 Generate e-Paper Clip

ఉపాధ్యాయ విద్యలో చేరినవారికి కేంద్ర విద్యా శాఖ కొత్త బాధ్యతలు అప్పగించింది. ఉపాధ్యాయ విద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసుకుని పట్టా చేత పట్టుకుని వెళ్లాలంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తించాలని సూచించిన ఎన్.సి.టీ.ఈ. పట్టా పొందాలంటే కనీసం ఐదు గురు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చి దిద్దాల్సిందేనని తేల్చిచెప్పింది. కేవలం తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకోవడం, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే ఉపాధ్యాయ విద్యకు సరిపోదని, సమాజంలో నిరక్షరాస్యత నిర్మూలనలోనూ భవిష్యత్ ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఉపాధ్యాయ విద్యాసంస్థల్లో (టీఈఐ) చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా అక్షరాస్యత కార్య క్రమాల్లో పాల్గొనేలా కేంద్ర విద్యాశాఖ రూపొందించిన 32 పేజీల మార్గదర్శకాలను జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్.సి.టీ.ఈ.) అందు బాటులోకి తెచ్చింది. ఉల్లాస్ – నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఈ మార్గదర్శకాలను రూపొందించింది. జాతీయ స్థాయిలో ఎన్సీటీఈ గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థు లందరికీ ఈ నిబంధనలు అమలుకానున్నాయి. దేశవ్యాప్తంగా 15,509 గుర్తింపు పొందిన ఉపాధ్యాయ విద్యా సంస్థలు ఉండగా, వాటిలో 17,84,326 సీట్లు అందుబాటులో ఉన్నా యి. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ), డీఎ ల్ఎడ్, బీపీఈడీ, బీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సులను ఈ సంస్థలు నిర్వహిస్తున్నాయి.*

 

*కోర్సును బట్టి బాధ్యతలు*

 

*విద్యార్థి ఉపాధ్యాయులు ఎంతమందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే విషయాన్ని వారు అభ్యసిస్తున్న కోర్సు కాలవ్యవధిని బట్టి నిర్ణయించారు. రెండేళ్ల ఉపాధ్యాయ కోర్సు విద్యార్థులు కనీసం ఐదుగురికి అక్షరజ్ఞానం నేర్పాలి. మూడేళ్లకోర్సు విద్యార్థులు కనీసం ఆరుగురిని, నాలుగేళ్ల కోర్సు విద్యార్థులు కనీసం ఎనిమిది మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి. కేవలం బోధన చేయడంతో ఈ బాధ్యత పూర్తయినట్లు కాదు… తాము బోధించిన అభ్యాసకులు పునాది అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞాన మూల్యాంకన పరీక్ష(ఎఫ్ఎల్ఎన్ఎటీ)కు హాజరై ఉత్తీర్ణులై, ఉల్లాస్ కార్యక్రమం కింద అక్షరాస్యులుగా ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. అప్పుడే సంబంధిత విద్యార్థి ఉపాధ్యాయులకు గ్రేడ్లు కేటాయిస్తారు. అంటే విద్యార్థులు ఎంతమందికి పాఠాలు చెప్పారు అనే దానికంటే,వారిలో ఎంత మంది అక్షరాస్యులయ్యారన్నదే కీలకం.

 

*పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థల సహకారం*

 

ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఉపాధ్యాయ విద్యా సంస్థలు స్థానిక పాఠశాలలు, స్థానిక సంస్థలు, స్వచ్చంద సంస్థలు, సమాజసేవా సంస్థలతో సమన్వయం చేసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. నిరక్షరాస్యులను గుర్తించడం, వారికి బోధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం, మూల్యాంకన పరీక్షలకు హాజరయ్యేలా చూడటం వంటి బాధ్యతలను సమన్వయంతో నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థి ఉపాధ్యాయులు తాము గుర్తించిన నిరక్షరాస్యుల వివరాలతో ప్రత్యేక రికార్డును నిర్వహించాలి. వారికి బోధించిన విధానం, నేర్చుకునే క్రమంలో సాధించిన పురోగతి, బోధనా అనుభవాలు, అభ్యాసకుల అభివృద్ధికి సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలి. తమ బోధనా అనుభవాలపై ప్రతిబింబ నివేదికను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

 

*ఉపాధ్యాయ విద్య… సామాజిక బాధ్యత…*

 

2022-23లో ప్రారంభమైన ఉల్లాస్ కార్యక్రమం దేశంలో వయోజన అక్షరాస్యతను పెంపొందించడమే లక్ష్యంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ విద్యతో అనుసంధానించడం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనకు దోహదపడగలదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా పనిచేయబోయే వారిలో సామాజిక బాధ్యతను పెంపొందించడంతో పాటు, విద్యకు దూరంగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే దిశగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. దీంతో ఉపాధ్యాయ విద్యార్థులకు ఇకపై కళాశాల తరగతి గదులతో పాటు సమాజంలోనూ పాఠాలు చెప్పాల్సిన బాధ్యత ఏర్పడనుంది.ఉపాధ్యాయ పట్టా సాధించడానికి విద్యా ప్రమాణాలతో పాటు సామాజిక అక్షరాస్యత సాధన కూడా తప్పనిసరి అర్హతగా మారనున్నది.

సేకరణ :                                                             అలవాల పాండు రంగారావు. ప్రైవేట్ స్కూల్ టీచర్, & రిపోర్టర్.

Latest Articles

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి – ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

*లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు*

నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 2 ( పొలిటికల్ పవర్ న్యూస్...

Related Articles

కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాకతో దద్దరిల్లిన భాగ్యనగరం – రెప రెప్పలాడిన కాషాయ జెండాలు. నరేంద్ర మోదీ పాలనకే పట్టం కడుతున్న దేశ ప్రజలు. జనసంద్రంగా బీజేపీ...

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.హైదరాబాద్ : ఎటు చూసిన కాషాయం అయినభాగ్యనగరం...

కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి – ఏనుగు సుదర్శన్ రెడ్డి.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు.ఘటకేశ్వర్ : అమిత్ షా మహా పాదయాత్రలో...

పేకాట స్థావరంపై పోలీసుల దాడులు – పట్టుబడ్డ ఇద్దరు జూదరులు…

  నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 2 నవంబర్ 2026.  రుద్రూర్ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మండల కేంద్రంలోని బొప్పాపూర్ రోడ్డులో గల ఖాళీ...
error: Content is protected !!