పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 26 2026: వనపర్తి జిల్లా గిరిజనుల సంప్రదాయ పండుగైన తీజ్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిజన సంప్రదాయాలను గౌరవించారు. తీజ్ పండుగ విశిష్టతను వివరిస్తూ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… గిరిజన యువతీ యువకులు ప్రకృతినే దైవంగా భావిస్తూ పుట్ట మట్టిని తీసుకువచ్చి అందులో విత్తనాలు నాటి తొమ్మిది రోజులపాటు నిష్టతో పూజలు నిర్వహిస్తారని తెలిపారు. మొలకలు వచ్చిన అనంతరం భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని గిరిజనులు విశ్వసిస్తారని పేర్కొన్నారు. తీజ్ వంటి పవిత్రమైన సంప్రదాయ పూజా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తీజ్ పండుగ సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆయన వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్‌తో పాటు పలువురు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
