ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రవక్త మహమ్మద్ బోధనలు, మానవాళికి మార్గదర్శకం —ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ప్రవక్త మహమ్మద్ బోధనలు, మానవాళికి మార్గదర్శకం —ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 26 2026: నపర్తి జిల్లా మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గాంధీ చౌక్‌లోని మహమ్మదీయ మసీదులో, అలాగే వనపర్తి 2వ వార్డు మసీదు లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ… ప్రవక్త మహమ్మద్ జీవితం, బోధనలు యావత్ మానవాళికి ఆదర్శప్రాయమని అన్నారు. ప్రేమ, కరుణ, దయ, నిజాయితీ, సహనం, సోదరభావం, పేదల పట్ల ఆదరణ వంటి గొప్ప మానవతా విలువలను ప్రవక్త మహమ్మద్ ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. ప్రవక్త మహమ్మద్ సమాజంలో ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ, శాంతి, సామరస్యంతో జీవించాలని బోధించారని ఎమ్మెల్యే తెలిపారు. మనిషిని మనిషిగా గౌరవించడం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, పేదలకు సహాయం చేయడం, సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడం ఆయన బోధనల్లోని ముఖ్యమైన సందేశాలని అన్నారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రవక్త మహమ్మద్ బోధనలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ మానవత్వంతో మెలగాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వనపర్తి నియోజకవర్గం అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సంతోషం, సౌభాగ్యాలను నింపాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. వనపర్తి పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, ఎస్ ఎల్ ఎన్ రమేష్ వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కౌన్సిలర్లు క్రాంతి, పరుశురాం, బి కృష్ణ , ఏర్పుల రవి, పాల రవి, రఘు , మైనార్టీ నాయకులు రహీం, వాక్బోర్డ్ సభ్యులు, రఫిక్ సలీం, ఆర్టిఏ సభ్యులు జహంగీర్, ఎన్ఎస్యుఐ అబ్రార్ సమీర్, మైనార్టీ నాయకులు వసీం ఇర్ఫాన్ జమీల్ ఆయుబ్ ఖాన్ కైసర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!