ePaper
Monday, September 14, 2026
📄 ePaper

తెలంగాణ జర్నలిస్టుల జట్టుకు మంత్రి పొంగులేటి అభినందనలు

📰 Generate e-Paper Clip

– ఏపీలో క్రికెట్ టోర్నీ విజేతగా తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల టీమ్

– కెప్టెన్ గా వ్యవహరించిన ఖమ్మం జర్నలిస్ట్ మానుకొండ రవికిరణ్‌కు ప్రత్యేక ప్రశంసలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బ్యూరో పసుపులేటి ఉమాశంకర్ జులై 27 2026: మ్మం :ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా కాలేజీ మైదానంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టుకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి విజయాన్ని అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా హెచ్‌ఎంటీవీ ప్రతినిధి మానుకొండ రవికిరణ్‌ ను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా ప్రశంసించారు. మన ఖమ్మం జిల్లాకు చెందిన విలేకరి సారథ్యంలో తెలంగాణ జట్టు అంతర్రాష్ట్ర స్థాయిలో ఛాంపియన్‌గా నిలవడం గర్వకారణమని కొనియాడారు. క్రీడలు మానసికోల్లాసంతో పాటు జర్నలిస్టుల మధ్య ఐక్యతను, రెండు రాష్ట్రాల ప్రతినిధుల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల జట్టు ఇలాంటి విజయాలను మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!