ePaper
Sunday, June 21, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విద్యార్థి ఒక పేద కుటుంబానికి చేయూతనందించారు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విద్యార్థి ఒక పేద కుటుంబానికి చేయూతనందించారు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి 19-06-2026 తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మం గ్రామంలోని సుందరయ్య నగర్ కి చెందిన తురక దేవి ప్రసన్న తండ్రి రవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బైపీసీ 440 మార్కులకు 434 మార్కులు సాధించినందుకుగాను వారిని సన్మానించిన క్రమంలో దేవిశ్రీ ప్రసన్న రాష్ట్ర ముఖ్యమంత్రితో వారి యొక్క కుటుంబ దీనస్థితిని గురించి వివరించడం జరిగింది. వారి తండ్రి తురక రవి వారి యొక్క కుటుంబాన్ని వదిలి వెళ్లి 14 సంవత్సరాలు అవుతుందని మరియు వారి తల్లిగారైన తురక జ్యోతి శ్రీలక్ష్మి వారి యొక్క కుటుంబ పోషణ మరియు కుటుంబ బాధ్యతలను ఒంటరి మహిళ గా వారి భుజాలపై నడిపిస్తూ ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తూ రోజువారి కూలీగా జీవనం సాగిస్తున్నారని వారు గత 20 సంవత్సరాల నుంచి అదే ఇంటిలోనే నివసిస్తున్నారని వారికి సొంత ఇంటి కల నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది. వెంటనే స్పందించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే వారి యొక్క దరఖాస్తును స్వీకరించి వెంటనే జిల్లా కలెక్టర్ కు వెంటనే ఈ యొక్క దరఖాస్తు పై విచారణ చేపట్టి వారికి వెంటనే టు బిహెచ్కె ఇల్లు మంజూరు చేయమని ఆదేశించినారు. తదుపరి జిల్లా కలెక్టర్ దివాకర్ టీ ఎస్ ఖమ్మం వెంటనే అర్బన్ తాహసిల్దార్ ని దాసరి జయచంద్ర నీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి విచారణ నివేదిక సమర్పించవలసిందిగా కోరినారు. తదుపరి తహసీల్దార్ విచారణలో భాగంగా ఖమ్మం గ్రామానికి చెందిన గ్రామ పాలనా అధికారి మరియు గిర్ధవార్ కి వెంటనే వారిని సుందరయ్య నగర్ లోని వారి నివాసంలో క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించడం జరిగింది. వెంటనే తహసీల్దార్ ది. 20/06/2026 రోజున వారి సొంత ఇంటీ కలను నెరవేర్చి వారికి బిహెచ్కె ఇంటికి అర్హులుగా గుర్తించి వారి సొంత ఇంటి కలను నేరవర్చడం జరిగింది. వెంటనే వారికీ ఇల్లు మంజూరు చేయడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!