ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపదళిత గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలంటూ తాహసిల్దార్ కార్యాలయం ముందు వ్యకాస. కే వీ పీ ఎస్...

దళిత గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలంటూ తాహసిల్దార్ కార్యాలయం ముందు వ్యకాస. కే వీ పీ ఎస్ ఆధ్వర్యంలో ధర్నా 

📰 Generate e-Paper Clip

దళిత గ్రామాల్లో తిష్ట వేసిన సమస్యలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ ఆగస్టు 04 2026: ప్రభుత్వ మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతనలేదు. గడపగడపకు టిడిపి దళిత గ్రామాల్లో ఏర్పాటు చేసి అభివృద్ధి గురించి మాట్లాడండి

వ్యకాస, కెవిపిఎస్ నాయకులు, డిమాండ్

మైదుకూరు తహసిల్దార్ కార్యాలయం ముందు మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం,కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది.

 ఈ ధర్నా ను ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్ జిల్లా ఉపాధ్యక్షులు 

జి.చంద్రశేఖర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జక్కరయ్యలు మాట్లాడుతూ… జులై 16 నుండి 26వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగరెండు సంఘాల ఆధ్వర్యంలో అసమానతలు లేని సమాజం కోసం సామాజిక శంఖారావం అనే పేరుతో దళితవాడల్లో వారి సమస్యలను తెలుసుకోవడం కోసం అధ్యయన యాత్రలు చేయడం జరిగిందని వారు తెలిపారు. మైదుకూరు మండలంలోని 10 గ్రామాల్లోని దళితవాడల్లో పర్యటనలు చేశామని ఈ సందర్భంగా అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు దళితగ్రామాల్లో ఉన్న పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకుండా ఉందని దళితగ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని వారు విమర్శించారు. అధికార పార్టీ గడపగడపకు తెలుగుదేశం అనే ప్రోగ్రాం ద్వారా అభివృద్ది చేశామని చెప్పుకుంటుందని ఇదే కార్యక్రమం దళిత గ్రామాల్లో పెట్టి అప్పుడు మాట్లాడమని వారు సూచించారు. అనేక గ్రామాల్లో ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప ఏ యొక్క ప్రభుత్వంలో కూడా వాళ్లకి ఇంటి స్థలం, పక్కా బిల్డింగులు రావడం లేదని, సిసి రోడ్లు కరెంటు సమస్యలు డ్రైనేజీ మొదలైన సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వారు తెలిపారు.

అనేక గ్రామాలకు స్మశాన సౌకర్యం లేదని స్మశానం ఉన్నచోట 

రోడ్లు,నీటి సమస్య తీవ్రంగా ఉందని వారు తెలిపారు,దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన చట్టాలు ఏ మాత్రం వీరికి ఉపయోగపడటం లేదని రాజకీయ పార్టీలు వీరిని ఓటు బ్యాంకుగా చూస్తున్నాయి తప్ప వీరి సమస్యలు తమవిగ గుర్తించడం లేదని వారుదుయ్యబడ్డారు తక్షణమే దళిత గ్రామాల్లోని మౌలిక సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గురయ్య, ఆవాజ్ మండల అధ్యక్ష కార్యదర్శులు, షరీఫ్, ఖాదర్ బాషా, వ్యాకాస మండల నాయకులు రవి సుధాకర్, ఇమామ్ ఓబులేసు, లక్ష్మీదేవి తామస్, లక్ష్మయ్య,బాలరాజు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు,

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!