ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దిమదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ విజయకి ఘన సన్మానం 

దిమదర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ విజయకి ఘన సన్మానం 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్: దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామానికి చెందిన నాగెండ్ల సుమతీ రత్నం ది మదర్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి. విజయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నందుకు మన గుంటూరు జిల్లాకే ప్రత్యేక గౌరవంగా భావిస్తూ డాక్టర్ విజయ ను ప్రత్యేకంగా సన్మానించడం జరిగినది ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్’ (WSO) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఆమె ఎన్నికయ్యారు. ప్రస్తుతం డాక్టర్ విజయ గుంటూరులోని లలిత పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు అనుబంధంగా ఉన్న అంకినీడు అడ్వాన్స్‌డ్ స్ట్రోక్ సెంటర్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. 2026 నుంచి 2030 వరకు నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగింపు… ప్రపంచవ్యాప్తంగా 95 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది సభ్యులు పాల్గొన్న ఈ ఎన్నికల్లో డాక్టర్ విజయ ఘన విజయం సాధించినట్లు లలిత పీవీఎస్ ఇన్‌స్టిట్యూట్ వ్యవస్థాపకులు, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి.వి. రాఘవ శర్మ వెల్లడించారు. మొత్తం 18 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆమె ఒకరిగా గెలుపొందారు. డాక్టర్ విజయ 2026 నుంచి 2030 వరకు నాలుగేళ్ల కాలపరిమితికి గాను ఆసియా-ఓషియానియా రీజియన్ ప్రతినిధిగా వ్యవహరించనున్నారు.పక్షవాతం (స్ట్రోక్) నివారణ, చికిత్స, పునరావాసం మరియు పరిశోధనల రంగంలో అంతర్జాతీయ స్థాయిలో దిశానిర్దేశం చేసే అత్యున్నత సంస్థ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్. బోర్డు సభ్యురాలిగా డాక్టర్ విజయ అంతర్జాతీయ స్థాయిలో స్ట్రోక్ చికిత్స మార్గదర్శకాల రూపకల్పన, వివిధ కార్యక్రమాల పర్యవేక్షణ, వైద్య నిపుణుల మధ్య సమన్వయం మరియు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించనున్నారు.ఈ సన్మాన కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!