ఎన్విఆర్ టీవీ తెలుగు పొలిటికల్ పవర్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ జులై 27 2026: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల మాజీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో పుణ్యక్షేత్రమైన మల్లర్ హేమచలా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో విశిష్ట సేవలు అందించిన శ పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని ప్రజాసేవలో మళ్లీ చురుకుగా పాల్గొనాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మల్లూర్ దేవస్థాన మాజీ చైర్మన్ నూతిలకంటి ముకుందం, బిఆర్ఎస్ పార్టీ మహిళా సెక్రెటరీ, భవాని, ఎస్టి సెల్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి కేక్కం జగదీష్, మంగపేట మండల మాజీ సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి యూత్ నాయకులు, ముప్పారాపు సందీప్,నూతిలకంటి గౌరి శంకర్,అజ్జు, రాంప్రకాష్, సోహెల్, తదితరులు పాల్గొన్నారు.
