ఉచిత న్యాయ సేవల టోల్‌ఫ్రీ నంబర్ 15100
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వాంకిడి, అక్టోబర్ 22 2026: వాంకిడి మండలంలోని దొడ్డిగూడ గ్రామ ప్రజలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనూష సూచించారు. న్యాయ సహాయం అవసరమైన అర్హులైన వారు ఉచిత న్యాయ సేవల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 15100కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడినవారు, న్యాయ సహాయం పొందేందుకు అర్హత కలిగిన బాధితులు ఈ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని వివరించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు భయపడకుండా, తమ హక్కులపై అవగాహన పెంచుకుని ఉచిత న్యాయ సేవలను పొందాలని సూచించారు. ఈ సేవలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.


