ePaper
Monday, June 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్అంతపురంధర్మవరం ఏరియా ఆసుపత్రిలో హెచ్ డి ఎస్ కమిటీ, వైద్యులతో ఆసుపత్రి సేవలపై నిర్వహించిన సమీక్షలో...

ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో హెచ్ డి ఎస్ కమిటీ, వైద్యులతో ఆసుపత్రి సేవలపై నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్

📰 Generate e-Paper Clip

ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో సమీక్ష నిర్వహించిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం — మంత్రి సత్యకుమార్ యాదవ్

రూ.1.66 కోట్ల విలువైన ఆధునిక వైద్య పరికరాలతో ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించడం జరిగింది — మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందాలి — వైద్యులకు మంత్రి సత్యకుమార్ దిశానిర్దేశం

పరిశుభ్రత, క్రమశిక్షణ, నాణ్యమైన సేవలు తప్పనిసరి — మంత్రి సత్యకుమార్ ఆదేశాలు

ధర్మవరం ఏరియా ఆసుపత్రి సేవలను మరింత బలోపేతం చేస్తాం — మంత్రి సత్యకుమార్ యాదవ్

ఎమర్జెన్సీ నుంచి వార్డు వరకు సేవల్లో సమయపాలన తప్పనిసరి — మంత్రి సత్యకుమార్ యాదవ్

రోగులతో మర్యాదగా, మానవత్వంతో వ్యవహరించాలి — వైద్యులకు మంత్రి సత్యకుమార్ సూచనలు

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ అనంతపురం జిల్లా బ్యూరో ధర్మవరం, జూన్ 15:– ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ (HDS కమిటీ), వైద్యులు, వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పాల్గొని ఆసుపత్రి పనితీరు, వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, పెండింగ్ అభివృద్ధి పనులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ధర్మవరం ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా బలోపేతం చేసి, ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ధర్మవరం మాత్రమే కాకుండా పరిసర గ్రామాలు, మండలాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో రోగులు ఈ ఆసుపత్రికి వస్తున్నారని, అందువల్ల సేవల నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐ ఓ సీ యల్ ) సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ అర్ ) నిధుల ద్వారా సుమారు రూ.68 లక్షల విలువైన ఆధునిక వైద్య పరికరాలు ధర్మవరం ఏరియా ఆసుపత్రికి అందించబడినట్లు చెప్పారు. వీటిలో సిటిజి మిషన్, స్ట్రెచర్లు, ట్రాలీలు, పల్స్ ఆక్సీమీటర్లు, బ్లడ్ & ఫ్లూయిడ్ వార్మర్స్, ఫీటల్ డాప్లర్లు, క్రాష్ కార్ట్ ఎమర్జెన్సీ ట్రాలీలు, ఓట్ లైట్స్, సక్షన్ యంత్రాలు, ఈ యన్ టీ హెడ్ లైట్, ఈసీజీ మిషన్‌లు, మల్టీపారా మానిటర్లు, ఎల్ డి ఆర్ టేబుల్స్, ఐ సి యు బెడ్స్, వార్డు బెడ్స్ వంటి అనేక ఆధునిక పరికరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా సుమారు రూ.98 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలు ఆసుపత్రికి అందించబడినట్లు చెప్పారు. అందులో ఫుల్లీ ఆటోమేటిక్ బయో-కెమిస్ట్రీ అనలైజర్, 4 ప్రోబ్స్ యు ఎస్ జి స్కానర్ కలర్ డాప్లర్ అల్ట్రాసౌండ్ సిస్టమ్, ఏ ఎస్ ఎస్ ఆర్ (కంప్యూటర్ & ప్రింటర్)తో బి ఈ ఆర్ ఏ(బ్రెయిన్‌స్టెమ్ ఎవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ), డబుల్ పంచ్ లాపరోస్కోపీ సెట్ వంటి సదుపాయాలు ఉన్నాయని వివరించారు. ఈ పరికరాలు కేవలం ఆసుపత్రిలో ఉండటానికే కాకుండా, ప్రజలకు సమయానికి నాణ్యమైన చికిత్స అందించేందుకు పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. రోగి ఆసుపత్రికి వచ్చిన క్షణం నుంచి చికిత్స పూర్తయ్యే వరకు ఆలస్యం, నిర్లక్ష్యం, అసౌకర్యం ఉండకూడదని వైద్యులు, వైద్యాధికారులకు ఆదేశించారు. మంత్రి సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. ఆసుపత్రిలో బయోమెట్రిక్అ టెండన్స్సి స్టమ్త ప్పనిసరిగా అమలు చేసి సిబ్బంది హాజరు పారదర్శకంగా ఉండేలా చూడాలి. ఎమర్జెన్సీ, లేబర్ రూమ్, ఒపీ, వార్డులు అన్నింటిలో సేవలు సమయపాలనతో అందాలి. రోగులతో, వారి కుటుంబ సభ్యులతో మర్యాదగా, సహానుభూతితో వ్యవహరించాలి. ఆసుపత్రిలో ఎక్కడా పరిశుభ్రత లోపం ఉండకూడదు. ప్రతి వార్డు, కారిడార్, బాత్రూమ్, ఆసుపత్రి పరిసర ప్రాంతాలు శుభ్రంగా నిర్వహించాలి. ఆసుపత్రి ఆవరణలో చెత్త, మురుగు నీరు, దోమల పెరుగుదల, అస్వచ్ఛ వాతావరణం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రోగులకు అవసరమైన తాగునీరు, బాత్రూమ్‌లు, వీల్‌చైర్లు, స్ట్రెచర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. పరికరాల నిర్వహణ, సర్వీసింగ్‌ను నిర్లక్ష్యం చేయకుండా తరచూ తనిఖీ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదల ఆసుపత్రి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ నమ్మకంతో వచ్చే వైద్య సేవల కేంద్రం కావాలి. ధర్మవరం ఏరియా ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తాను అని తెలిపారు. సమీక్షలో భాగంగా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రస్తావించిన పలు సమస్యలపై కూడా మంత్రి స్పందించారు. బాత్రూమ్ మరమ్మత్తులు, ఎమర్జెన్సీ వార్డులో ACలు, 500 LPM PSA ఆక్సిజన్ ప్లాంట్ రిపేర్లు, లేబర్ రూమ్ బ్యాక్‌సైడ్ రక్షణ చర్యలు, విద్యుత్ సంబంధిత సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, వైద్యులు, వైద్యాధికారులు, డిఆర్. నరసింహులు, డిఆర్. సోనియా, ఆర్.ఎం హరి శ్రీనివాసులు, సుబ్బారావు, గుండా పుల్లయ్య, డిఆర్. నజీర్, డిఆర్. ముక్తియార్ అహ్మద్, డిఆర్. నితిన్, డిఆర్. రాముడు, డిఆర్. నివేదిత, డిఆర్. చంద్రిక, ఎన్ఎస్ రమాదేవి, హెడ్ సిస్టర్. పూర్ణచంద్ర, ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జారీచేసిన వారు: రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యుల వారి కార్యాలయం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!