ePaper
Sunday, August 2, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సర్పంచ్ బచ్చలి రాములు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ.

 

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా. ఈ రోజు నూతన విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం సందర్భంగా మందమరి మండలంలోని సారంగపల్లి గ్రామ సర్పంచ్ బచ్చలి రాములు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బచ్చలి రాములు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మొదటి రోజు పాఠ్య పుస్తకాలు, నోట్స్ బుక్స్ అందించడం గొప్ప విషయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం లాగ విద్యను నిర్వీర్యం చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం పెద్ద పీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సవ్య, స్థానిక వార్డు మెంబర్లు షెబ్బీర్, మంద సువర్ణ, గారె కుమార్, ఉపాధ్యాయులు, మరియు తల్లితండ్రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!