– కారేపల్లి పోలీసులు పట్టించుకోవడం లేదు….
– న్యాయం చేయాలని వేడుకున్న తల్లి గుగులోత్ సుజాత
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి జులై 21 2026: మే 31 నుండి తన కూతురు కనిపించడం లేదని, పోలీసులకు పిర్యాదు చేసినా ఇంతవరకూ ఆచూకీ తెలుసుకోలేదని, వెంటనే న్యాయం చేయాలని తల్లి గుగులోత్ సుజాత వేడుకుంది. ఖమ్మం లోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…. గతంలో ఒక సారి బాణోత్ ముఖేష్ అనే యువకుడు తన పాపను తీసుకెళ్తే వెతుకులాడి తీసుకొచ్చామని తెలిపింది. మళ్ళీ తన పాపకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లాడని, ఇంతవరకూ ఆచూకీ లేదని పేర్కొంది. ముఖేష్ మాత్రం ఉరిలోనే ఉన్నాడని, మేము ఎక్కడ వెతికినా పాప ఆచూకీ తెలియడం లేదని, ఈ విషయంపై కారేపల్లి పోలీసుకులకు పిర్యాదు చేశామని తెలిపింది. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నామని, పట్టించుకోవడం లేదని తెలిపింది. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని పాప ను తమకప్పగించాలని వేడుకుంది. ఈ సమావేశంలో బాణోత్ మల్సూర్, బాణోత్ సరోజ పాల్గొన్నారు.


