ePaper
Friday, November 13, 2026
📄 ePaper

నిజామాబాద్ జిల్లా ట్రగ్ కంట్రోల్ అధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన ఫార్మసిస్ట్ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా 370/12…

📰 Generate e-Paper Clip

ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి జిల్లా సంఘం కృషి..

డ్రగ్ కంట్రోల్ అధికారులను కలిసిన నిజామాబాద్ జిల్లా కమిటీ…

పొలిటికల్ పవర్ ఎన్విఆర్ టివి ప్రతినిధి నిజామాబాద్ జిల్లా బ్యూరో…

తెలంగాణ ఫార్మసిస్టు సంక్షేమ సంఘం – నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫార్మసిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన గౌరవం, ఫార్మసీ రంగంలో ఎదురవుతున్న సమస్యలు మరియు ప్రభుత్వ నిబంధనల అమలుపై చర్చించేందుకు జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను జిల్లా కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. నర్సయ్య ను, నిజామాబాద్ అర్బన్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వి. శ్రీకాంత్ , నిజామాబాద్ రూరల్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి ఆర్. శ్రీలత  సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లాలోని ఫార్మసిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలు, మెడికల్ షాపుల నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, డ్రగ్ ఇన్‌స్పెక్షన్ల సమయంలో పాటించాల్సిన విధానాలు, ప్రభుత్వ నిబంధనలపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా ప్రతి మెడికల్ షాపులో అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సేవలు అందుబాటులో ఉండటం,   షెడ్యూల్ H1 రిజిస్టర్, పర్చేస్ & సేల్స్ రికార్డ్స్ నిర్వహణ, నార్కోటిక్ మరియు హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విషయంలో చట్టపరమైన నిబంధనల పాటింపు, ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మందుల పంపిణీ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంఘం ప్రతినిధులు కోరారు.

అలాగే ఫార్మసిస్టులు తమ వృత్తిపరమైన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని, తనిఖీల సమయంలో నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పిస్తూ పారదర్శకమైన విధానాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

ఫార్మసిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి శాఖాపరమైన సమన్వయంతో కృషి చేయడమే తమ సంఘం ప్రధాన ఉద్దేశమని సంఘం ప్రతినిధులు తెలిపారు.

ప్రభుత్వ నిబంధనలు పాటించడం ప్రతి మెడికల్ షాపు యజమాని, ఫార్మసిస్ట్ బాధ్యత అని, ప్రజలకు సురక్షితమైన ఔషధ సేవలు అందించడంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఫార్మసిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తి గౌరవం పరిరక్షణతో పాటు ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో సమన్వయంగా పనిచేస్తామని జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు.

జిల్లా కార్యవర్గ సభ్యులు:

1. అజ్మీర గణేష్ – జిల్లా అధ్యక్షులు..
2. అతనలా నాగశంకర్– జిల్లా ప్రధాన ఆకార్యదర్శి…
3. లింగాల శంకర్ -జిల్లా కోశాధికారి …
4. మొహమ్మద్ షాబాజ్ మూర్తుజా -నిజామాబాద్ టౌన్ అధ్యక్షులు…

మన ఐక్యతే మన బలం – మన వృత్తి గౌరవమే మన లక్ష్యం!


 

Latest Articles

మోజర్ల గ్రామంలో బాలల సభ నిర్వహణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ఉపాధి హామీ పనులకు శ్రీకారం -సర్పంచ్ చంద్రశేఖర్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

బాబోయ్ పెద్దపులి..! అటవీ ప్రాంత గ్రామాల్లో మళ్లీ భయాందోళనలు

ఏపీలోని వేలేరుపాడు మండలం కొత్తూరు వద్ద మూడు ఆవులు హతం గోదావరి పరివాహక...

1/70 చట్టం జోలికొస్తే సహించేది లేదు!

ఆదివాసుల హక్కులు, భూముల పరిరక్షణ కోసం నవంబర్ 30న తహసీల్దార్ కార్యాలయం...

రూ.4 కోట్లతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు చర్యలుఅశ్వారావుపేట, పొలిటికల్ పవర్, ఆర్‌సీ...

Related Articles

కలెక్టరేట్‌ను బురిడీ కొట్టిస్తున్న బాసులు.. ఏజెంట్ టు గవర్నమెంట్ కోర్టులో అసలేం జరుగుతోంది?

 * GO Ms.No.43 లో లేని సర్వే నంబర్ 161/3 మాయాజాలం వెనుక ఎవరున్నారు?* ఒకే సూపరింటెండెంట్ 12 ఏళ్ల గుత్తాధిపత్యం.. ఫైళ్ల కదిలికలపై అనుమానాల నీడ!* అధికారుల తప్పుడు నివేదికలతో బలిపీఠం...

ధరణి కాలనీలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ శైలజ  * డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ చొరవతో కదిలిన అధికారులు  * డిప్యూటీ కమిషనర్‌తో కలిసి...

మేడిపల్లి, నవంబర్ 12 (పొలిటికల్ పవర్ న్యూస్ ప్రతినిధి, ఉపేందర్ కూరెళ్ళ):మేడిపల్లి డివిజన్ పరిధిలోని ధరణి కాలనీలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. కాలనీలో మౌలిక వసతుల...

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి  * ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వినతిపత్రం అందజేత  * డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమని వెల్లడి

గార్ల / ఇల్లందు (పొలిటికల్ పవర్ ప్రతినిధి, మాలోత్ అజయ్ నాయక్):గత 20 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నిస్వార్థంగా వైద్య సేవలందిస్తున్న ఆశా కార్యకర్తల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు కృషి...
error: Content is protected !!