ePaper
Monday, August 31, 2026
📄 ePaper
Homeతెలంగాణనేపాల్‌లో హృదయ విదారక దృశ్యం..!

నేపాల్‌లో హృదయ విదారక దృశ్యం..!

📰 Generate e-Paper Clip

చెల్లిని కాపాడుకుంటూ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న బాలుడు..!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పియన్ 9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం మధ్య.. ఓ చిన్నారి తన చెల్లికి అండగా నిలిచిన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.

చుట్టూ విధ్వంసం..

ముఖంపై గాయాలు..

మనసులో భయం..

అయినా తనను తాను పట్టించుకోకుండా.. తన చెల్లిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు ఆ బాలుడు. తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు.. వారు క్షేమంగా ఉన్నారో లేదో తెలియదు.. అయినా చెల్లిని మాత్రం వదలడం లేదు.

ఆ చిన్నారి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన..

చెల్లిని దగ్గరకు తీసుకుని నిలబడిన తీరు.. ప్రకృతి సృష్టించిన విషాదం కంటే.. ఆ ఇద్దరి పరిస్థితే మరింత హృదయాన్ని కలచివేస్తోంది. కష్టమొచ్చినప్పుడు వయసుతో సంబంధం లేకుండా బాధ్యత తీసుకునే బంధం..

అన్నాచెల్లెళ్ల అనుబంధం.

నిన్నటి వరకు తల్లిదండ్రుల చేతులు పట్టుకుని నడిచిన ఆ బాలుడు. ఈరోజు తన చెల్లికి తానే అండగా నిలవాల్సిన పరిస్థితి. తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న ఆ చిన్నారి కళ్లలో.. వారు తిరిగి వస్తారనే ఆశ మాత్రం ఇంకా కనిపిస్తోంది. కొన్ని దృశ్యాలు వార్తలు కావు.. మనసును కదిలించే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!