ePaper
Monday, November 2, 2026
📄 ePaper

పట్టభద్రుల ఓటు నమోదును పొడిగించండి – పలుస శంకర్ గౌడ్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 02 2026: పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని మరో 10 రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ కోరారు. చాలా మంది పట్టభద్రులు అనేక కారణాల వల్ల ఇప్పటి వరకు ఓటర్లుగా నమోదు చేసుకోలేకపోయారు. ఉద్యోగాలు, ఉన్నత చదువులు, ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల చాలా మంది గడువులోపు దరఖాస్తు చేయలేకపోయారు. పట్టభద్రుల ఓటు హక్కు అత్యంత విలువైనది, ప్రతి ఒక్కరికీ ఓటు నమోదు అవకాశం కల్పించాలని శంకర్ గౌడ్ కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఇంకా అవగాహన లేకపోవడం వల్ల నమోదు ఆలస్యం అయింది. ఆన్ లైన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు కూడా కొందరికి ఇబ్బందిగా మారాయి. కావున మానవతా దృక్పథంతో మరో 10 రోజులు గడువు పొడిగిస్తే చాలా మందికి న్యాయం జరుగుతుంది. పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని శంకర్ గౌడ్ కోరారు. ఇంకా వేల మంది పట్టభద్రులు నమోదుకు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి గడువు పొడిగింపుపై ప్రకటన చేయాలని పలుస శంకర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. పట్టభద్రుల గొంతుకగా నా ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. ఓటు నమోదు పొడిగిస్తే ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుంది అని అన్నారు.

Latest Articles

ఐదేళ్లు అధికారంలో ఉండి కాలువలో తట్టెడు మట్టి తీయలేదు.. ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారా?

బుద్ధారం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేసింది మేఘారెడ్డి.. రాజకీయ మైలేజ్‌ పొందింది...

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సమరశంఖం: 2వ డివిజన్ (పాండురంగాపురం) ‘ఆధార్ పార్టీ’ అభ్యర్థిగా సునీల్ గౌడ్ పోటీ!

పొలిటికల్ పవర్ / డిజిటల్ న్యూస్  జిల్లా ప్రతినిధిఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల :...

✍️త్యాగాల పునాదులపై నిర్మితమైనది ఏఐటీయూసీ.శ్రామిక లోకానికి ఏఐటీయూసీ కొండంత అండ.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ...

Related Articles

మెగా బెల్టు గ్రేడింగ్ టెస్ట్ లో ప్రతిభ చూపిన కొత్తకోట విద్యార్థి విద్యార్థినులు

–  విద్యార్థులకు సర్టిఫికెట్ బెల్టు అందించిన మహబూబ్నగర్ మేయర్ మమత,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక  పి ఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.02.2026.మహబూబ్నగర్ పట్టణంలోని లక్ష్మీ...

షార్ట్ సర్క్యూట్ తో తోక మాధవి ఇల్లు దగ్ధo

–  షార్ట్ సర్క్యూట్ బాధితులను పరామర్శించిన కొత్తకోట కాంగ్రెస్ పార్టీ నాయకులు,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.02.2026.వనపర్తిజిల్లా కొత్తకోట మున్సిపాలిటీ...

హరీష్ రావు సభా ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 31 2026: పెద్దమందడి మండలం అల్వాల గ్రామంలో నవంబర్ 2న మాజీ...
error: Content is protected !!