*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
పులివెందుల ఆర్.ఓ. కార్యాలయం దగ్గర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద కూర్చున్నాడని కొందరు గొర్రెల మందలా సంకలు గుద్దుకుంటూ విమర్శలు చేస్తున్నారు.
అసలు జగన్ ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు ఆ పంథాను ఎంచుకున్నాడు? దాని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి? అన్నది ఆలోచించే తెలివి ఉండాలి.. అది చంద్రబాబు కి ఖచ్చితం గా ఉంది..
ఒక మాజీ ముఖ్యమంత్రి కింద కూర్చున్న దృశ్యం పులివెందులకే పరిమితం కాలేదు. స్థానిక మీడియా నుంచి జాతీయ మీడియా వరకు ఈ ఘటనను కవర్ చేశాయి. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీరు, పులివెందుల పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి నిరసన చర్చనీయాంశంగా మారాయి.
ఒక్కసారి ఆలోచించండి.. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆర్.ఓ. కార్యాలయం ముందు కూర్చుంటే దేశవ్యాప్తంగా వార్త అవుతోంది. జాతీయ మీడియా చర్చల్లోకి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై దేశం దృష్టి పడుతోంది. అనే ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడు..
మరోవైపు ఈ పరిణామాలతో కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రతిష్టపై ప్రశ్నలు తలెత్తేలా ఈ ఘటన మారింది. కూటమి ప్రభుత్వం పరువు పోయింది.
ఇదంతా చూసిన తర్వాత కూడా జగన్ ఏదో తెలియక కింద కూర్చున్నాడని మాట్లాడేవాళ్ల అమాయకత్వానికి ఏం పేరు పెట్టాలి?
రాజకీయాల్లో ఎప్పుడు నిలబడాలి, ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు కింద కూర్చోవాలి అన్నది తెలిసినవాడే రాజకీయ నాయకుడు.. పులివెందుల యాక్షన్ కి రియాక్షన్ కూడా ఎప్పుడు ఉండాలి అనేది కూడా జగన్ ఈ పాటికే నిర్ణయించి ఉంటాడు..
జగన్ చర్య వెనుక ఉన్న ఉద్దేశం, వ్యూహం గురించి చర్చించండి. ఆయన చేసిన పనిని అర్థం చేసుకోకుండా ఎగతాళి చేయడం మీ రాజకీయ అవగాహనారాహిత్యానికి అద్దం పడుతుంది.
జగన్ను విమర్శించే ముందు ఆయన ఆ చర్యతో ఏం సాధించాలనుకున్నాడో ఒక్కసారి ఆలోచించండి.
కావాలంటే న్యూస్ ఛానల్స్ చెక్ చేసుకోండి..ఆదివారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి

