
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్
✍️లేబర్ కోడ్లతో కార్మిక చట్టాల రద్దు దుర్మార్గం.
✍️ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాన్ని అడ్డుకుందాం.
✍️పెట్టుబడిదారులకు అనుకూల విధానాలను కేంద్రం వీడాలి.
✍️కనీస వేతనాలు, సంక్షేమ బోర్డులు అమలుకు ఉద్యమిద్దాం.
✍️శ్రామిక ఐక్యతతోనే పాలకుల మెడలు వంచాలి.
✍️దేశవ్యాప్త సమ్మెలకు కార్మిక లోకం సిద్ధం కావాలి.
👉సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
✒️ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ వేడుకలు.
పాల్వంచ//కొత్తగూడెం: శతాబ్దానికి పైగా సాగిన అలుపెరుగని పోరాటాలు, లెక్కలేనన్ని రక్తతర్పణలు, వీరోచిత త్యాగాల పునాదులపై నిర్మితమైన ఏఐటీయూసీ మాత్రమే యావత్ శ్రామిక లోకానికి కొండంత అండగా నిలుస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ఉద్ఘాటించారు. ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచ పట్టణంలో శనివారం కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని సుమారు 25 ప్రధాన కార్మిక అడ్డాలు, కూడళ్లలో ఎర్రజెండాలను ఘనంగా ఆవిష్కరించిన అనంతరం, స్థానిక మున్సిపల్ కార్యాలయ వద్ద ఏర్పాటు చేసిన ఏఐటీయూసీ కార్మిక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బ్రిటిష్ వలస పాలన కాలం నుంచి స్వాతంత్ర్యోద్యమం వరకు దేశ ప్రగతి చక్రాలను తిప్పిన కార్మికుల చెమట చుక్కలకు విలువనివ్వాల్సిన పాలకులు, నేడు పెట్టుబడిదారీ వర్గాలకు ఊడిగం చేస్తూ హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రామికులు దశాబ్దాల పాటు సమ్మెలు చేసి సాధించుకున్న 44 కార్మిక సంక్షేమ చట్టాలను కేంద్ర పాలకులు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, యజమానులకు లాభాలు చేకూర్చేలా నాలుగు లేబర్ కోడ్లుగా కుదించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. జాతి సంపదగా విలసిల్లుతున్న నవరత్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా తెగనమ్మే దేశద్రోహ విధానాలను శ్రామిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పెన్షన్ సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా చట్టబద్ధమైన కనీస వేతనాలను సవరించాలని, సంక్షేమ బోర్డులను సమర్థవంతంగా అమలు చేసి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హక్కులు ఎవరూ దానంగా ఇవ్వరని, పోరాటాల ద్వారానే వాటిని సాధించుకోవాలని, ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు రానున్న రోజుల్లో దేశవ్యాప్త సమ్మెలకు కార్మిక శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మేయర్ మూడ్ గణేష్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచందర్ రావు, ఉప్పుశెట్టి రాహుల్, కార్పొరేటర్లు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, గుర్రం వెంకటేశ్వర్లు, ఏ ఎం సి డైరెక్టర్ వాడే లక్ష్మీ, సీపీఐ జిల్లా సమితి సభ్యులు వీ పద్మజ, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, ప్రజాసంఘాల నాయకులు శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి సునీల్ కుమార్, జన్మీయ, కరీం, వైఎస్ గిరి, వేములపల్లి శ్రీను, గౌతమి కృష్ణ, పల్లపు యాకయ్య, కోరే కృష్ణ, పున్నారావు, గోపి, అద్దంకి బాబు, రాము, వెంకట్, బాబు, శెట్టి చేరాలు, జకరయ్య, కొంగర అప్పారావు, ఆలపాటి ప్రసాద్, నామ పండు, నవీన్, కాకటి రవీందర్, ఆదినారాయణ, రవి, కిరణ్, నాగేశ్వరరావు, వెంకన్న, ప్రభావతి, పుష్ప, ముతమ్మ, నాగమణి, ప్రేమచంద్, ప్రశాంత్, వెంకన్న, రమేష్, కాటూరి రాము, కొమరయ్య, అల్లి వెంకటేశ్వర్లు, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

