
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్
కొత్తగూడెం, నవంబర్ 5 ( ) నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల గొంతుకగా నిలిచి, వారి హక్కుల సాధన కోసం పోరాడేందుకు డాక్టర్ బూసిరెడ్డి శంకర్రెడ్డిని టీఆర్ఎస్ (డెమోక్రటిక్) పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించింది. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ వెల్లడించారు.
గతంలో రోటరీ ఇంటర్నేషనల్ గవర్నర్గా డాక్టర్ శంకర్రెడ్డి విశేష సేవలందించారని, కరోనా విపత్కర సమయంలో వేలాది మందికి అండగా నిలిచారని తెలిపారు. ఈ సందర్బంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ మాట్లాడుతు రాజకీయ, సామాజిక రంగాల్లో అనుభవం కలిగిన ఆయనకు పట్టభద్రులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉద్యోగం, ఉపాధి, విద్య, ఆర్థిక భరోసా అంశాలను ఎన్నికల ఎజెండాగా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. పట్టభద్రుల హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాడటంతో పాటు ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేసి, గ్రాడ్యుయేట్ల ప్రతినిధులతో కమిటీలు నిర్మిస్తామని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
*హోదా కోసం కాదు.. హక్కుల సాధన కోసం!*
సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం తమ పార్టీ నినాదమని, ఎమ్మెల్సీ పదవి హోదా కోసం కాకుండా పట్టభద్రుల హక్కుల సాధన కోసమేనని నరాల సత్యనారాయణ స్పష్టం చేశారు. డాక్టర్ శంకర్రెడ్డి అభ్యర్థిత్వానికి ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్థి, న్యాయవాద, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్సీ ఇన్చార్జి కాంపెల్లి ప్రభు కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి సాధు శంకర్, భద్రాచలం ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి సింగతి నందకుమార్ తదితరులు పాల్గొన్నారు.

