పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం పలు శుభకార్యాలకు హాజరయ్యారు. 1. వనపర్తి ఎం వై ఎస్ ఫంక్షన్ హాల్ లో పట్టణానికి చెందిన బెస్త నర్సింహులు, సునీతల మనుమడు చిరంజీవి అగస్త్యరామ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు. 2. అనంతరం కొత్తకోట రోడ్ లో ఏర్పాటు ఏర్పాటు చేసిన నూతన ఎలక్ట్రికల్ స్కూటర్ షోరూమ్ సందర్శించారు. షోరూమ్ ఏర్పాటుచేసిన ఇంతియాజ్, మేనేజర్ భాస్కరాచారి ఎమ్మెల్యే అభినందించారు. 3. కొత్తకోట లోని ఆర్ కే ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ చాపల సత్య రెడ్డి మనవడి తొట్లే కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. 4. పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి కీర్తి రెడ్డి ల కుమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు యువకులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

