– జూరాల ప్రాజెక్టుకు 27,200 క్యూసెక్కులఇన్‌ఫ్లోనమోదవుతున్నరాష్ట్రప్రభుత్వంఇంకానెట్టెంపాడు,భీమా కోయిల్ సాగర్, మోటార్లును ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి,
– దేవరకద్ర టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 28. 2026.
జూరాల ప్రాజెక్టులో ఇప్పటికే 7.1 టీఎంసీల నీటినిల్వసామర్థ్యానికిచేరుకుందిసోమవారం సాయంత్రం లేదా మంగళవారం గేట్లు ఎత్తే అవకాశంఉందనిఅధికారులుచెబుతున్నారు.అయినాపాలమూరురైతుకునీళ్లుఅందించకుండా, ఆ నీటిని శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని,పోతిరెడ్డిపాడుకు వెళ్లేలా చేయడానికే పంపులనుఆన్,చేయడంలేదని,ఈప్రభుత్వంమొద్దునిద్రపోతుంది వరదొచ్చినప్పుడు నీటిని ఎత్తిపోయకుండా కిందికి జార విడుస్తుందని దేవరకద్ర టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం
ఒక ప్రకటన లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణరైతులప్రయోజనాలకంటేఆంధ్రప్రదేశ్,ప్రయోజనాలే ముఖ్యమా అని, తక్షణమేభీమా-1లోనిభూత్‌పూర్ (1.3టీఎంసీ),సంగంబండ(3.3టీఎంసీ),భీమా-2లోని శంకర సముద్రం (1.8 టీఎంసీ),రంగసముద్రం (1.9 టీఎంసీ), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలోని గూడెందొడ్డి(1.2టీఎంసీ),ర్యాలంపాడు(4టీఎంసీ),అలాగేకోయిల్‌సాగర్(1.5టీఎంసీ)రిజర్వాయర్లను నింపేందుకు వెంటనేమోటార్లను ప్రారంభించాలి, అలాగే జూరాల ఎడమ, కుడి కాలువలకు పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేయాలని, ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా లేకపోవడంతో రైతులు పంటలను వేయలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి పాలమూరు రైతుకు నీళ్లు అందించి, ఆ నీటిని శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడుకు వెళ్ల కుండ వెంటనే పంపులను ఆన్ చెయ్యాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

