ePaper
Monday, September 14, 2026
📄 ePaper

కోసూరి రమేష్ గౌడ్ మృతి, మాకు తీరని లోటు -మంత్రి తుమ్మల

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి తుమ్మల సుడా (SUDA) మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోసూరి రమేష్ గౌడ్ మృతి పట్ల రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆవేదన చెందారు. రమేష్ మృతి కాంగ్రెస్ పార్టీకే కాక తనకు వ్యక్తి గతంగా తీరనిలోటని తెలిపారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రి టౌన్ ఏరియా పార్టీ కో-ఆర్డినేటర్ యర్రం బాలగంగాధర్ తిలక్ అధ్యక్షతన కోసూరి రమేష్ స్వగృహంలో సంతాప సభ జరిగింది. సంతాపసభ రమేష్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది . ఖమ్మం నగరంలోని కోసూరి స్వగృహానికి వెళ్లి నివాళులర్పించిన తుమ్మల మాట్లాడుతూ… రమేష్ ఆది నుంచి తన వెంటే ఉంటూ మంచి రాజకీయ నాయకుడిగా పేరుందారన్నారు. నిరాడంబర జీవితం గడిపిన రమేష్ నిగర్వి అన్నారు. రమేష్ గౌడ్ మరణం పార్టీకి , స్థానిక ప్రజలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు . రమేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కష్ట సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు గుండె నిబ్బరాన్ని, మనో ధైర్యాన్ని ప్రసాదించాలని తుమ్మల ఆకాంక్షించారు. మంత్రి తుమ్మలతో పాటు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పలువురు నాయకులు, బంధు మిత్రులు అందరు రమేష్ గౌడ్ సంతాప సభలో ప్రసంగించారు . రమేష్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. రమేష్ మృతి తమ అందరికీ తీరని లోటు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఖమ్మం కార్పోరేషన్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి ఖాదర్ బాబా, మాజీ మేయర్ పూనకొల్లు నీరజ మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .

Latest Articles

బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులుగా గన్నమనేని కిరణ్ కుమార్ 

  తెలంగాణ రాష్ట్రం తరుపున బిసిఐ ప్రతి నిధిగా సేవలు అందించ బోతున్న...

గణేష్ చతురుద్ది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి

  పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం

*కాంగ్రెస్ బలోపేతానికి సోషల్ మీడియా కీలక ఆయుధం**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దిన పత్రిక పొలిటికల్ న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు...
error: Content is protected !!