పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్, కలసపాడు. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కడప డిస్ట్రిక్ట్. దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర లలో పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోక నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సీపీఎం మండల కార్యదర్శి గురయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి లాజరస్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరుగుతున్న ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదల కారణంగా రవాణా ఛార్జీలు అధికమై, దాని ప్రభావం నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలపై పడుతోందన్నారు. గ్యాస్ ధరలు పెరగడంతో హోటల్ యజమానులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.నూనె, కందిపప్పు, బెల్లం, గోధుమపిండి, టమాటా, పచ్చిమిర్చి తదితర నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో ఆటో, లారీ యజమానులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వాహనాలను ఫైనాన్స్ సంస్థలకు అప్పగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం గుర్తించి, వెంటనే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు లాజరస్, నవాజ్, కమిటీ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ పీరా, వామపక్ష నాయకులు ఏసురత్నం, రాముడు, జయరాజు, రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం రాస్తారోకో.
RELATED ARTICLES
