ePaper
Friday, June 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా నాయకుణ్ణికి అశేష జనవాహిని అభినందనల వెల్లువ.

ప్రజా నాయకుణ్ణికి అశేష జనవాహిని అభినందనల వెల్లువ.

📰 Generate e-Paper Clip

శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రముఖులు.

ఘనంగా రావుల జన్మదిన వేడుకలు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11 2026: నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వారి స్వగృహంలో మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కళ సాహితీ వేదిక, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి రావులకు శుభాకాంక్షలు తెలిపారు. గాయకులు రామ్ రెడ్డి, సత్తార్ పాటలు పాడి నిరంజన్ రెడ్డి, రావుల చేసిన అభివృద్ధిని కొనియాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… పదవులు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు వారు మరింత ప్రజాసేవలో ఉండి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

వృద్ధాశ్రమంలో మాజీ కౌన్సిలర్ అన్నప్రసాద వితరణ. రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మాజీ కౌన్సిలర్ నందిమల్ల శారదఅశోక్ “శ్రీ చౌడేశ్వరి వృద్ధాశ్రమం”లో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు ఎస్.వెంకటేశ్వరమ్మ, రాము మరియు వృద్ధులు గతములో ఆశ్రమానికి రావుల చేయూత అందజేశారని వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలుస రమేష్ గౌడ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, గంధం. బాలపీర్, గంధం పరంజ్యోతి, విజయ్ కుమార్, గులాం ఖాదర్ ఖాన్, పలుస శంకర్ గౌడ్, వేణు రెడ్డి, నందిమల్ల రమేష్, గంధం నాగరాజు, నాగనమోని మన్నెం, నీలస్వామి, గులాం ఖాదర్ ఖాన్, ఉంగ్లం తిరుమల్, వెంకట్ సాగర్, జోహెబ్ హుస్సేన్, సూర్యవంశం గిరి, అరీఫ్, సయ్యద్ జెమిల్, ఫజల్, సమద్, పాషా, ఎర్ర శ్రీనివాసులు, కుమార్, శిరీవాటి శంకర్, ఖాదర్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!