– నిర్ణీత గడువు లోగా పరిష్కారానికి జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. ఆదేశాలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక – PGRS” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 147 ఫిర్యాదులను సమర్పించారు. ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులపై చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, చట్ట పరిధిలో పరిష్కరించగల ప్రతి ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు భరోసా కల్పించారు.
ఎస్పీ ముఖ్య ఆదేశాలు
ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించాలి. నిర్ణీత గడువులోగా చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి. బాధితుల సమస్యలను సానుభూతితో విని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలి. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలి. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్, డి.టి.సి డి.ఎస్పీ శ్రీ అబ్దుల్ కరీం, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



