పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు కడప జిల్లా. మండలంలోని సెయింట్ ఆంటినీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదిన వేడుకలు అలాగే తెలుగు భాషా దినోత్సవ గొప్పతనాన్ని, తెలుగు భాషా పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ చిత్తా, రాజశేఖర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు చిత్తా, ప్రభావతి పాల్గొన్నారు. మొదటగా అతిథులను సభా వేదిక మీదికి మల్లికార్జున రెడ్డి , లూర్దుయ్య, వసంత కుమారి, వెంకట్ రెడ్డి, తెలుగు భాషా పండితులు అందరూ ఆహ్వానించారు. అనంతరం విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనం గురించి, మల్లికార్జున రెడ్డి విశదీకరించి చెప్పారు. తెలుగు పదాలలో ఉన్న కమ్మదనాన్ని ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ముందుకు వచ్చిన మహా మేధావులలో గిడుగు రామ్మూర్తి గొప్పవాడని లు ర్ద య్య అన్నారు. అలాగే తెలుగు రాయడం ,చదవడం, చాలా కష్టతరమని దీనికి ఓర్పు , పట్టుదల ఎంతో అవసరమని వారు తెలిపారు. అనంతరం క్విజ్ పోటీలో నిర్వహించారు. గెలుపొందిన వారికి పాఠశాల యాజమాన్యం చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రపంచ తెలుగు భాష దినోత్సవం… ఘనంగా గిడుగు వెంకట రామ్మూర్తి జన్మదిన వేడుకలు..
RELATED ARTICLES
