ePaper
Tuesday, June 16, 2026
📄 ePaper
Homeతెలంగాణమంచిర్యాలప్రభుత్వ ఆస్పత్రి కార్మికులను ఐఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య

ప్రభుత్వ ఆస్పత్రి కార్మికులను ఐఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి మంచిర్యాల, జూన్ 14 2026: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 18,000 మంది శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్, బెడ్‌సైడ్ కార్మికులను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ఎస్‌పీఎస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కుర్రి సైదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో ఎస్‌పీఎస్ అసోసియేషన్ నూతన జిల్లా కమిటీ నిర్మాణ కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న బొస్క నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కుర్రి సైదయ్య, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్ మరియు బెడ్‌సైడ్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తి ప్రశ్నించే ఏకైక సంఘం ఎస్‌పీఎస్ అసోసియేషన్ మాత్రమేనని అన్నారు. కార్మికుల గుర్తింపు, భద్రత, కనీస వేతనాల పెంపు, ఉద్యోగ భరోసా వంటి పలు డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఆరోగ్య శాఖ మంత్రికి అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటివరకు సరైన స్పందన లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాల మాదిరిగానే చిన్న స్థాయి కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాల నుంచి కార్మికులను తొలగించి, వారిని ఐఎఫ్ఎంఐఎస్ లో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జూలై నెలాఖరు వరకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18,000/- మంది కార్మికుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర, జిల్లా కమిటీలతో చర్చించి భారీ స్థాయిలో మహా పోరాట కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీఎస్ రాష్ట్ర కమిటీ కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు వైనాల రవి, మాతంగి అనిల్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు కుమార్, పి. అంజలి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ జిల్లాల నాయకులు, మంచిర్యాల మరియు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌పీఎస్ అసోసియేషన్ నూతన మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రశాంత్ ఎన్నిక కాగా, మరో 13 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!