ePaper
Friday, September 18, 2026
📄 ePaper

హర్షగూడలో కాంగ్రెస్‌కు భారీ షాక్ – బీఆర్ఎస్‌లో భారీ చేరికలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక /పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ మహేశ్వరం, జూన్ 14 2026: హైదరాబాద్ శివారులోని మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీ 67వ మంకల్ డివిజన్ పరిధిలోని హర్షగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఉపసర్పంచ్ రవి నాయక్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది నాయకులు, కార్యకర్తలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు చేరిన నాయకులు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. హర్షగూడ గ్రామంలో జరిగిన ఈ భారీ చేరికలతో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

మజ్జి శ్రీను స్థానం భర్తీ చేసేదేవరు….???

విశాఖ మధురవాడ–భీమిలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుమజ్జి శ్రీనివాస్‌ (చిన్న శ్రీను) రాజీనామాతో భీమిలి రాజకీయాల్లో కొత్త చర్చచిన్న శ్రీను స్థానంలో తదుపరి బాధ్యతలు ఎవరికి అన్నదానిపై ఆసక్తిరేసులో మాజీ కార్పొరేటర్‌ పోతిన...

వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుడు ఆగమనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ కూకట్ పల్లి వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్ భైరవ్‌ గణేష్‌...

రామ్ కృష్ణ గుప్తా జన్మదిన వేడుకల్లో అన్నదానం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి సెప్టెంబర్ 07 2026: కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలోని 246వ డివిజన్ బీజేపీ...
error: Content is protected !!