పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 17 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజు పామిరెడ్డిపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం హాజరు కావడం జరిగింది. ఇట్టి సమావేశంలో విద్యపై ప్రత్యేక దృష్టి చేపడుతున్నట్లు ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రశంసించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ పాఠశాలకు రోజువారీగా వచ్చి మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పడం జరిగింది.
అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల లో కన్నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యతమైన విద్యా అందిస్తారని విద్యార్థులకు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా ఇదే పాఠశాలలో చదివిన విద్యార్థులు నలుగురు వివిధ గురుకులాలలో సీట్లు సాధించడం అట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు సన్మానం గ్రామ సర్పంచ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరం కృషిచేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ ఉపాధ్యాయ బృందం యువకులు తల్లిదండ్రులు ఇతరులు పాల్గొన్నారు.
