ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీలేని పోరాటం కంచె గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు.. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వరుస విజయాలు రెవెన్యూ యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు: మంత్రి పొంగులేటి

📰 Generate e-Paper Clip

 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

ప్రభుత్వ భూముల పరిరక్షణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రాజీలేని వైఖరితో ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఒకవైపు కఠిన చర్యలు తీసుకుంటూనే, మరోవైపు దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను పరిష్కరించేందుకు సమర్థవంతమైన న్యాయపోరాటం చేస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విలువైన ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయవివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి  ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రెవెన్యూ అధికారులు, న్యాయశాఖ, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయాన్ని పెంచి, సుప్రీంకోర్టు సహా వివిధ న్యాయస్థానాల్లో ప్రభుత్వ వాదనలను బలంగా వినిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారని వివరించారు.

గతంలో సరైన పర్యవేక్షణ, సమన్వయం కొరవడటంతో అనేక విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి దశాబ్దాల తరబడి న్యాయవివాదాలు కొనసాగాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. ప్రభుత్వ భూములకు సంబంధించిన పాత రికార్డులు, రెవెన్యూ ఆధారాలు, న్యాయపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, ప్రభుత్వ హక్కులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఈ క్రమంలో ఐఎంజీ కంచె గచ్చిబౌలి 400 ఎకరాల భూముల వ్యవహారంలో 2003 నుంచి కొనసాగుతున్న న్యాయపోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజయం లభించింది. 2024 మార్చి 7న తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వగా, 2024 మే 3న సుప్రీంకోర్టు ఐఎంజీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అయితే, 2025లో ఇదే ప్రాంతంలోని అటవీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సుమోటో విచారణ చేపట్టి ఆదేశాలు జారీ చేసింది.

తాజాగా మియాపూర్ భూములకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం ప్రజా ప్రభుత్వం చేపట్టిన న్యాయపోరాటానికి మరో బలమైన నిదర్శనమన్నారు.

ఈ రెండు ఉదంతాలు ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేక చొరవను, రెవెన్యూ శాఖ సమర్థవంతమైన కార్యాచరణను ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. గత రెండు దశాబ్దాలుగా వివాదాల్లో చిక్కుకున్న అత్యంత విలువైన భూములను న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వానికి చెందేలా అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం సాధారణ విషయం కాదని, దీని వెనుక ప్రభుత్వ చిత్తశుద్ధి, అధికారుల సమన్వయం, న్యాయపరమైన కృషి ఉన్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం న్యాయస్థానాల్లో సమర్థవంతంగా ప్రభుత్వ వాదనలు వినిపించి ఆ భూములు ప్రభుత్వానికి దక్కడంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారులు, న్యాయ నిపుణులు, ప్రభుత్వ న్యాయవాదులను మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు.

ప్రభుత్వ భూమి అంటే అది ఏ ఒక్క వ్యక్తికో, సంస్థకో చెందిన ఆస్తి కాదని, అది రాష్ట్ర ప్రజలందరి ఉమ్మడి ఆస్తి అని మంత్రి స్పష్టం చేశారు. నేటి తరంతో పాటు భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఆక్రమణలకు పాల్పడినా, అక్రమంగా హక్కులు పొందేందుకు ప్రయత్నించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ప్రభుత్వ భూములను కాపాడటం అంటే ప్రజల సంపదను కాపాడటమే. ఆక్రమణలను అడ్డుకోవడం మాత్రమే కాకుండా, న్యాయస్థానాల్లోనూ ప్రభుత్వ హక్కులను సమర్థవంతంగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం. కంచె గచ్చిబౌలి, మియాపూర్ భూముల విషయంలో సాధించిన విజయాలు ఈ దిశగా మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు మరింత పటిష్టమైన చర్యలు కొనసాగిస్తాం. ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  స్పష్టం చేశారు.

Latest Articles

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

Related Articles

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు....అక్టోబర్ 31 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్నాడు లక్షెట్టిపేట్ గర్ల్స్ ఉన్నత...

error: Content is protected !!