ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిప్రభుత్వ వసతి గృహల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ప్రభుత్వ వసతి గృహల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి

📰 Generate e-Paper Clip

–  జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 23.2026.
వనపర్తి పట్టణంలోని బాలుర గిరిజన సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్  రాంనగర్ కాలనీలోని కళాశాల విద్యార్థుల గిరిజన సంక్షేమ  హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా సందర్శించారు.
 ఈసందర్భంగాహాస్టల్‌లోనివంటగది,స్టోర్‌రూమ్‌ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణ, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు,ఇతరవసతులనుపరిశీలించారు.హాస్టల్‌లోమొత్తంఎంతమందివిద్యార్థులు ఉన్నారు అని ఆరా తీయగా 140 మంది సామర్థ్యానికిగానుప్రస్తుతం111మందివిద్యార్థులుఉన్నారనివార్డెన్‌నుసమాధానమిచ్చారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా హాస్టల్‌లో ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని వార్డెన్‌ను ఆదేశించారు. మరుగుదొడ్లు, హాస్టల్ గదులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. హాస్టల్ సమీపంలోని నాలా చెత్త, పూడికతో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు నాలాను శుభ్రం చేయించి డ్రైనేజీ సమస్యనుపూర్తిగాపరిష్కరించాలనిఆదేశించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి సమస్య కూడా లేకుండా చూడాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి హాస్టల్‌లో అందుతున్న వసతులు, భోజన నాణ్యత, తాగునీరు, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటిఇబ్బందులుకలగకుండాఅవసరమైనఅన్నిసౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మధు, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ ఉన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!