ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

ప్రమాదం చెప్పిరాదు! అప్రమత్తం అవసరం.! విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి, “అర్నబ్ ” తుఫాన్, దాని యొక్క ప్రభావం వలన, గాలులు మరియు వర్షాలు ఉండవచ్చును. కావున ప్రతి ఒక్కరు విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా తీసుకోవలసిన తగిన జాగ్రత్తలు*

📰 Generate e-Paper Clip

 

*1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.*

*2. తడిసిన చేతులతో స్టార్టర్లు కానీ మోటార్లు కానీ ముట్టుకోరాదు.*

*3.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.*

*4.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత, మీ ఊరు లైనమన్ కి మరియు కరెంటు ఆఫీసుకి తెలియచేయవలెను.*

*5.పార్కులలో గాని స్టేడియంలో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.*

*6.ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు..*

*7.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.*

*8.కరెంటు కు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.*

*9.చిన్న పిల్లలను కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.*

*10.మీ ఇల్లు లలో ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు..*

*11.గాలి,దుమారం,వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.*

*12.ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ యొక్క స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసిన తర్వాతనే నీళ్లు పెట్టిన వస్తువును ముట్టవలెను.*

*13.ఉరుములు మెరుపులతో వర్షం పడేటప్పుడు డిష్ కనెక్షన్ తీసివేయవలెను.*

*14.వర్షం పడుచున్నప్పుడు టీవీ,ఫ్రిడ్జ్ మరియు కంప్యూటర్ ల యొక్క స్విచ్ లను ఆఫ్ చేయవలెను,లేనిచో వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది.*

*15.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు. *ఉరుములు, మెరుపులు పిడుగులు వలన ప్రమాదాలు జరగవచ్చును.

*16.ఇంట్లోకి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో ఆ ఊరికి సంబంధించిన, మీ ఊరులో ఉన్న, దగ్గర లో ఉన్న, అధికారి అయినా JLM, ALM,LM, LI, sub station, AE లేదా 1912 దృష్టికి తీసుకెళ్లాలి.*విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

Latest Articles

గుర్వాయిగూడెంలో  టర్నడో బీభత్సం.. పంట తోటలు నేలమట్టం!

మామిడి, జీడి, పామాయిల్, పత్తి పంటలకు తీవ్ర నష్టం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...

మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.....

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత,...

Related Articles

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. *వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి...
error: Content is protected !!