ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 24 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో ఆపదలో ఉన్న గుడ్డి కురుమక్క కుటుంబానికి ‘మేఘన్న అభయహస్తం’ ద్వారా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు యాదవ్ మాట్లాడుతూ… ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన మేఘన్నకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబానికి అవసరమైన సమయంలో తాము అండగా ఉంటామని, భవిష్యత్తులో కూడా కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని సర్పంచ్ రాములు యాదవ్ పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం అభినందనీయమని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి చేయూత అందించడం ద్వారా వారికి ధైర్యం కల్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ఆర్థిక సహాయం అందించినందుకు గుడ్డి కురుమక్క కుటుంబ సభ్యులు మేఘన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి సాగర్, వార్డు సభ్యులు బాలయ్య, ఎస్. రమేష్, గోవర్ధన్ గౌడ్, జనార్ధన్, ఎం. శివరాం, ఎం. రాములు, సాయి కిరణ్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీ. మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.....

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత,...

రుద్రూర్ లో ఘనంగా ఏకాదశి వేడుకలు

రుద్రూర్ లొ ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు..- విఠలేశ్వర స్వామి ఆలయంలో...

సామాన్యుడి సగటు జీవితం ప్రశ్నగా మారింది

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలను జయప్రదం చేయండి

ప్రముఖ వచన కవి మర్రికంటి నరసింహ కు గుర్రం జాషువ సాహిత్య పురస్కారంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్...

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.

అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది. యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం. జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్కటవుదాం.. జేఏసీతో కలిసి నడుద్దాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే జేఏసీ ప్రధాన లక్ష్యం. -వనపర్తి జిల్లా...

కనిమెట్ట గ్రామంలో వితంతు, వికలాంగుల పింఛన్ల వెరిఫికేషన్

ప్రతి దరఖాస్తుదారుడి ఇంటి వద్దే పరిశీలనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: కొత్తకోట మండలం కనిమెట్ట...
error: Content is protected !!