*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*
ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు చోటుచేసుకున్నాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న 13వ సచివాలయం పరిధిలో కీ.శే. మాజీ కౌన్సిలర్ వై.ఎస్. హమీద్ గారి కుటుంబ సభ్యులతో పాటు సుమారు 40 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సాదరంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల సభ్యులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.
ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలిచాయి.


*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*