ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

బీసీ-ఏ వర్గాల హక్కులకు భంగం కలిగించొద్దు..

📰 Generate e-Paper Clip

ముద్దిరాజు కులాన్ని బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి

వనపర్తిలో బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 07 2026: వనపర్తి: బీసీ-ఏ వర్గాల హక్కులు, రిజర్వేషన్ అవకాశాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ వనపర్తిలో బీసీ-ఏ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం అంబేద్కర్ చౌరస్తా నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ముద్దిరాజు కులాన్ని బీసీ-డీ నుంచి బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇప్పటికే బీసీ-ఏలో ఉన్న 57 కులాలకు ఈ నిర్ణయం వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రజక, వాల్మీకి, వడ్డెర, నాయీ బ్రాహ్మణ, మేదర, బెస్త, గంగపుత్ర, గంగిరెద్దుల తదితర కులాలకు రిజర్వేషన్ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. బీసీ-ఏలోని వెనుకబడిన కులాల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు ఆయా కులాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వం తన ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ బీసీ-ఏ కుల సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

భక్తి శ్రద్ధలతో  శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ మహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

భక్తి శ్రద్ధలతో శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లల్లో దీపావళి సంబరాలు నిర్వహించిన. సర్పంచ్ కొర్సా రమేష్

  జూలూరుపాడు నవంబర్ 08 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్భంగా....

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.నవంబర్.09.2026.శ్రీ శ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక...

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా...

పండ్ల వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాత గంజిలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆదేశాలు రోడ్డు వెడల్పు అనంతరం అదే ప్రాంతంలో శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేస్తాం వ్యాపారులకు ఎమ్మెల్యే భరోసా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...
error: Content is protected !!