ePaper
Friday, August 28, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బైక్‌పై జనంలోకి మెచ్చా.. ఆత్మీయ పలకరింపులు

బైక్‌పై జనంలోకి మెచ్చా.. ఆత్మీయ పలకరింపులు

📰 Generate e-Paper Clip

రాఖీ కట్టిన మహిళలు.. పలువురి కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్, ఆగస్టు 28: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌ మెచ్చా నాగేశ్వరరావు గురువారం పట్టణంలో బైక్‌పై పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాధారణంగా బైక్‌పై తిరుగుతూ స్థానికులను పలకరిస్తూ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయంగా ముచ్చటించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ముందుగా మాజీ జడ్పీటీసీ జూపల్లి రమణారావు నివాసానికి వెళ్లిన మెచ్చా నాగేశ్వరరావుకు స్థానిక బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరావు భారీ మెజారిటీతో విజయం సాధించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని మహిళలు ఆకాంక్షించారు.

అనంతరం బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ కొల్లి రవికిరణ్‌ నివాసానికి వెళ్లిన మెచ్చా ఆయన కుటుంబ సభ్యులను పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కొంతసేపు వారితో ఆత్మీయంగా ముచ్చటించారు.

అనంతరం 10టీవీ రిపోర్టర్‌ భాస్కర్‌ వివాహం సందర్భంగా ఆయన నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

అలాగే అల్లూరి వెంకట రామారావు అల్లుడు కమ్మ వెంకట కిరణ్‌–సంధ్య దంపతుల నూతన కాంప్లెక్స్‌ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పర్యటనలో మాజీ జడ్పీటీసీ జూపల్లి రమణారావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, మోహన్‌రెడ్డి, యూఎస్‌ ప్రకాశ్‌రావు, మాజీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు సంక ప్రసాద్‌, మాజీ సర్పంచ్‌ నారం రాజశేఖర్‌, కలపాల బాబురావు, ఉస్మాన్‌, ఆసిఫ్‌, కోటగిరి కిషోర్‌, ఆరేపల్లి రాంబాబు, జూపల్లి పద్మజ, జీళ్ల శ్రీదేవి, సంకుల స్వరూప తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!