ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపబ్రహ్మంగారి మఠం పాత గురుకుల పాఠశాలను పునరుద్ధరించాలి : ఎస్ఎఫ్ఐ - డివైఎఫ్ఐ

బ్రహ్మంగారి మఠం పాత గురుకుల పాఠశాలను పునరుద్ధరించాలి : ఎస్ఎఫ్ఐ – డివైఎఫ్ఐ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఏం, వెంకటేశ్వర్లు, కడప (జిల్లా):- బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని ఏళ్ల చరిత్ర ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలను యధాస్థానానికి తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు సోమిరెడ్డి పల్లె అరవింద్ లు మాట్లాడుతూ… బ్రహ్మంగారిమఠంలోని గురుకుల పాఠశాల ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించి ఎంతోమందిని ప్రయోజకులను చేసిందని అలాంటి పాఠశాలను తోట్లపల్లి కి తరలించడం జరిగిందని వారు తెలిపారు. నూతనంగా ఏర్పాటు అయిన మహా గురుకులంలో పరిమితికి మించి విద్యార్థులు ఉండడంతో అక్కడ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని వారు తెలిపారు. మండల కేంద్రంలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న గురుకుల పాఠశాలను యధావిధిగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాత స్కూల్ కు రక్షణ లేనందున వస్తువులన్నీ కూడా మాయమైపోతున్నాయని వారన్నారు. యధా స్థానానికి స్కూల్ తీసుకురావడం వల్ల మండలం డెవలప్మెంట్ అవుతుందని వారు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్పందించి సెక్రెటరీ కి కాల్ చేసి యధా స్థానానికి పాత స్కూల్ ను తీసుకురావాలని మండలంలో విద్యార్థులకు సమస్య రాకూడదని త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం కావాలని వారు సెక్రటరీ కి తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు దేవా, డివైఎఫ్ఐ నాయకులు ఓబులేష్, రాజా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!