ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

బ్లాక్‌మెయిలింగ్‌కు తెగబడి డిప్యూటీ తహసీల్దార్ కేడర్ అధికారి బలి! – పౌర సరఫరాల శాఖ మేనేజర్ లక్ష్మీనారాయణ ఆత్మహత్యతో బయటపడ్డ దందా!

📰 Generate e-Paper Clip

 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

భద్రాచలం /పాల్వంచ:

సమాజంలో జరుగుతున్న  అవినీతిని   ఎండగట్టాల్సిన కలం… కొందరి చేతుల్లో బ్లాక్‌మెయిలింగ్ ఆయుధంగా మారిపోతోంది!  రాజకీయ తరహాలో బెదిరింపులకు దిగుతూ, లంచగొండి దందాలకు అడ్డువచ్చిన ప్రభుత్వ అధికారుల ప్రాణాలను సైతం బలితీసుకుంటున్న ఘోరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.పాల్వంచకు చెందిన పౌర సరఫరాల శాఖ (సివిల్ సప్లైస్) మేనేజర్, డిప్యూటీ తహసీల్దార్ కేడర్ అధికారి అనంతుల లక్ష్మీనారాయణ (56) ప్రైవేట్ లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

అసలేం జరిగింది? – సూసైడ్ నోట్‌లో సంచలన నిజాలు!

శాఖ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీలో వినియోగదారుల నుంచి అక్రమంగా అదనపు వసూళ్లు చేయడం, ఎల్‌పీజీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు మళ్లించడం వంటి అక్రమాలను మేనేజర్ లక్ష్మీనారాయణ గట్టిగా నిలదీశారు. అయితే, ఈ అవినీతి దందాను అడ్డుకున్నందుకుగానూ ఆయనపై కక్ష పెంచుకున్న ఆఫీసు మహిళా కంప్యూటర్ ఆపరేటర్ రజిత, ఆమె భర్త (ఒక పత్రికా విలేకరి) మరియు మరికొందరు మీడియా మిత్రులు జట్టుకట్టారు.

సదరు మహిళతో లక్ష్మీనారాయణపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెట్టించి, దాన్ని అడ్డుపెట్టుకొని కొన్నాళ్లుగా ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారు. కేసు ఉపసంహరించుకోవాలంటే ఏకంగా రూ. 1 కోటి ఇచ్చి తీరాల్సిందేనంటూ సదరు విలేకరుల బృందం లక్ష్మీనారాయణను బ్లాక్‌మెయిల్ చేసినట్లు ఆత్మహత్య లేఖలో స్పష్టంగా బయటపడింది.

> “అవినీతిని అడ్డుకున్నందుకే తప్పుడు కేసులు పెట్టి, రూ.1 కోటి డిమాండ్ చేస్తూ నన్ను నిలువునా బలితీసుకున్నారు…”

> — లక్ష్మీనారాయణ గదిలో లభించిన ఆత్మహత్య లేఖలోని సారాంశం.

నార్కోటిక్ దందా కాదు… ఇది కలానికి పట్టిన చీడ!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయనాయకులు చేసే హంగామా ఒకెత్తయితే… జర్నలిజం ముసుగులో కొంతమంది చేస్తున్న ఈ ‘పవర్ ప్లే’ అసలుకే ఎసరు తెస్తోంది. నిజాయితీగా పనిచేసే అధికారులను టార్గెట్ చేస్తూ, వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఇలాంటి వారి ఆగడాలు హద్దులు దాటుతున్నాయి.

* అక్టోబర్ 17: భద్రాచలంలోని గోదావరి లాడ్జిలో రూమ్ తీసుకున్న లక్ష్మీనారాయణ.

* శనివారం రాత్రి: తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య.

* పోలీసుల చర్యలు: మృతుడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు, సూసైడ్ నోట్ ఆధారంగా మహిళా ఉద్యోగి రజిత, ముగ్గురు జర్నలిస్టులతో సహా మొత్తం ఆరుగురిపై BNS సెక్షన్ 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు.

ప్రభుత్వ అధికారులు, ప్రజాసంఘాల తీవ్ర ఆగ్రహం!

నిజాయితీ గల అధికారిని పొట్టనబెట్టుకున్న ఈ జర్నలిస్టుల వేధింపుల వ్యవహారంపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, స్థానికులు మండిపడుతున్నారు. వార్తల ముసుగులో బ్లాక్‌మెయిలింగ్ దందాలకు పాల్పడుతున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసులో ఉన్న ఎంతటి వారినైనా వదలకుండా జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలను నిరాధారంగా చేసి లక్ష్మీనారాయణ నిష్క్రమించడం పాల్వంచలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 

Latest Articles

మద్దిగట్లలో ఘనంగా ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ

వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర...

స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ. సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్, ఉప సర్పంచ్ ఊరటి...

ఆదికావ్యం రామాయణాన్ని అందించిన ఆదికవి వాల్మీకి – పలుస శంకర్ గౌడ్, పృథ్వీరాజ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్...

Related Articles

JSPW అన్నదాన కార్యక్రమం — # ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా జె యస్ పి డబల్యు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డిఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని వెంకటగిరి...

ఆకలి కడుపునకు‘అన్న’దాత… సమాజ సేవలో ‘JSPW ’ నయా ట్రెండ్! ఖమ్మం రూరల్ వెంకటగిరిలో సంచార జాతులకు ప్రేమతో అన్నదానం వ్యవస్థపాక అధ్యక్షులు పెద్దపాక రమేష్ బర్త్‌డే వేళ…...

 ఖమ్మం / పొలిటికల్ పవర్ / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (యర్ర నాగరాజు రెడ్డి):పేరుకే రాజకీయం… నినాదాలకే పరిమితమయ్యే నాయకులున్న ఈ రోజుల్లో, చేతల్లో సేవ చేస్తూ సమాజానికి కొత్త...

ఆకలికి అన్నం… మానవత్వానికి అండగా ‘JSPW’! వెంకటగిరిలో సంచార జాతులకు ఘనంగా అన్నదానం సంస్థ చైర్మన్ పెద్దపాక రమేష్ జన్మదినం సందర్భంగా విశేష సేవా కార్యక్రమం

 ఖమ్మం రూరల్ / పొలిటికల్ పవర్ / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ (ప్రత్యేక ప్రతినిధి - యర్ర నాగరాజు రెడ్డి):సామాజిక బాధ్యతను గుర్తుచేస్తూ, పేదరికం, ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు "మేమున్నామంటూ" అండగా...
error: Content is protected !!