ePaper
Monday, September 21, 2026
📄 ePaper

భక్తిశ్రద్ధలతో గణనాథుడికి ఘనంగా వీడ్కోలు… మార్మోగిన జై గణేష్ నినాదాలు

📰 Generate e-Paper Clip

జై బోలో గణేష్ మహారాజ్…భక్తి పారవశ్యంలో నిమజ్జనోత్సవం.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: దనాపురం మండలం తీర్మలాయపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలు 8వ వార్డు పరమేశ్వర యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రతిష్ఠించిన గణనాథుడికి శనివారం ఘనంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గణేష్ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. మంగళవాయిద్యాలు, డీజే సంగీతం, మహిళాలు బొడ్యమ్మలు, భక్తుల, యూత్ నృత్యాలతో గ్రామ వీధులు సందడిగా మారాయి. యువత, మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. “గణపతి బప్పా మోరియా.. జై గణేష్ మహారాజ్” అంటూ భక్తులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వార్డు ప్రజలకు, యువతకు,మహిళలకు, ఉత్సవ నిర్వాహకులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి ప్రత్యేక పూజలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో అరుదైన ఘనతసాధారణ...

తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా పత్తి విష్ణువర్ధన్ రెడ్డి

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు...

ప్రతి కుటుంబానికి ఇల్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు అనే లక్ష్యంతో పేదల...

Related Articles

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది అని ఆరోపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ .ED విచారణలో శ్రీవారి లడ్డూ ప్రసాదం లో ఎలాంటి జంతు కొవ్వు...

ప్రతి కుటుంబానికి ఇల్లు.. ప్రతి ఎకరాకు సాగునీరు అనే లక్ష్యంతో పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం చివ‌రి శ్వాస వ‌ర‌కు ప‌నిచేసిన నాయ‌కుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు.#YSRForeverWww.political...

తెలంగాణ ఉద్యమ కెరటం సాయిచంద్ 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 20 2026: తన పాటల ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలను...
error: Content is protected !!